telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

మరో ఘనత.. ఢిల్లీ లో టీఆర్ఎస్ కార్యాలయానికి భూమి అప్పగింత..

టి.ఆర్.ఎస్ పార్టీ మరో అరుదైన స్థాయికి చేరుకుంది. 20 ఏళ్ళ క్రితం కేసీఆర్ గారు తానొక్కడు మరో గుప్పెడు మందితో ప్రారంభించిన తెలంగాణ ఉద్యమం ఈ రోజు నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని విశ్వవ్యాప్తం చేసింది. ఒక్కడు ప్రారంభించిన పార్టీ ఈ రోజు కొమ్మలు కొమ్మలుగా పెరిగి ఒక మహా వృక్షమై దేశ రాజధాని ఢిల్లీలో ఒక అద్భుతమైన పార్టీ కార్యాలయాన్ని నిర్మించుకునే దిశగా టి ఆర్ ఎస్ ఒక చరిత్రను నమోదు చేసింది. ఉద్యమ రథసారధిగా ఆయన ప్రసంగాల కోసం యావత్ తెలంగాణ సమాజంతో పాటు విదేశాల్లో ఉన్న ఎంతో మంది తెలంగాణ బిడ్డలు ఆతృతగా ఎదురు చూసేవారు. ఎంతో బలమైన ఆంధ్రా లాబీయింగ్ ను ఎదుర్కొని కేంద్రాన్ని ఒప్పించి మెప్పించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఘనత కేసీఆర్ ది. ఎమ్మెల్యేలతో మూకుమ్మడిగా రాజీనామాలు చేయించడం , వై ఎస్ ప్రభుత్వంలో మంత్రి పదవులు వదులు కోవడం , తాను కేంద్రంలో మంత్రి పదవిని వదులు కోవడం సహా ఎన్నో సంచలనాలను సృష్టించారు కేసీఆర్ గారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడమే ఒక అద్భుతమైతే ఈ ఆరేండ్లలో దేశంలో ఏ రాష్ట్రమూ అమలు చేయనన్ని ప్రజా సంక్షేమ , అభివృద్ధి కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేయడంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మరో చరిత్రను సృష్టించారు. అలా అంచెలంచెలుగా ఎదిగిన టి ఆర్ ఎస్ పార్టీ నేడు దేశ రాజధాని ఢిల్లీలో ఒక అద్భుతమైన తెలంగాణ (టి ఆర్ ఎస్) భవన్ ను నిర్మించబోతున్నది . ఢిల్లీ వసంత్ విహార్ లో అధికారికంగా టీఆర్ఎస్ కు 1100 చదరపు మీటర్ల భూమి అప్పగింత ప్రక్రియ పూర్తయింది. ఈ మేరకు టి.ఆర్.ఎస్ పార్టీ కార్యాలయం నిర్మాణం కోసం ఢిల్లీలోని వసంత్ విహార్ లో స్థలం కేటాయించిన పత్రాలను మంత్రి ప్రశాంత్ రెడ్డి అందుకున్నారు. 

Related posts