telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

ఆ విషయం అసంతృప్తి కలిగించింది : నీతి ఆయోగ్

corona vaccine

గత ఏడాది నుండి మనల్ని ఇబ్బంది పెట్టిన కరోనా వైరస్ ను హతమార్చేందుకు ఇప్పుడిపుడే వ్యాక్సిన్లు వస్తున్నాయి. అయితే మాన్ దేశంలో ఇప్పటికే రెండు వ్యాక్సిన్ల అత్యవసర వినియోగానికి అనుమతి ఇచ్చింది భారత ప్రభుత్వం.. ఇప్పటికే కొవాగ్జిన్‌, కొవిషీల్డ్ వ్యాక్సినేషన్‌ దేశవ్యాప్తంగా ప్రారంభం అయ్యింది. అయితే, అక్కడక్కడ కొంతమంది అపోహలు మాత్రం ఉన్నాయి.. వ్యాక్సినేషన్‌తో ఏదో జరుగుతోందనే భయాలు కూడా ఉన్నాయి.. దీనిపై నీతి ఆయోగ్ కీలక వ్యాఖ్యలు చేసింది… కరోనా కష్టకాలంలో ప్రాణాలను పణంగా పెట్టి మరీ వైద్య సేవలందించిన వైద్యులు, వైద్య సిబ్బందిలో కొందరు వ్యాక్సిన్ తీసుకునేందుకు ముందుకు రాకపోవడం, వ్యాక్సిన్‌ వద్దని తిరస్కరించడం అసంతృప్తి కలిగించిందని నీతి ఆయోగ్ సభ్యులు డాక్టర్ వీకే పాల్ పేర్కొన్నారు. వ్యాక్సిన్ తయారవడం వెనుక ఎంతోమంది కృషి ఉందని, అలాంటి వ్యాక్సిన్‌ను తీసుకునేందుకు కొందరు హెల్త్ వర్కర్లు, డాక్టర్లు, నర్సులు ముందుకు రాకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.. కోవిడ్ వైరస్‌ ఎప్పుడు.. ఏ రూపం తీసుకుంటుందో తెలియదన్న ఆయన.. దానికి చెక్‌ పెట్టాలంటే వ్యాక్సిన్ తీసుకునేందుకు అంతా ముందుకు రావాలని కోరారు.  ఇక, ఇప్పటికే అనుమతి పొందిన కోవిషీల్డ్, కోవ్యాక్సిన్‌ వ్యాక్సిన్లు సురక్షితమైనవి అన్నారు వీకే పాల్.. వాటి వల్ల దుష్ప్రభావాలు, విషమ పరిస్థితులు ఎదుర్కొన్న పరిణామాలు అంతగా లేవని స్పష్టం చేశారు. ఒకవేళ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత దుష్ర్పభావాలు కనిపించినా చికిత్స అందించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసినట్లు గుర్తుచేశారు. . 

Related posts