telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

వ్యాక్సిన్ తీసుకుంటేనే మంచిదంట..!

Corona

మన దేశంలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నా విషయం తెలిసిందే. అయితే ఈ వైరస్ కు మన దేశంలో ఈ ఏడాది ఆరంభం నుండి వ్యాక్సిన్ ఇస్తున్న విషయం తెలిసిందే. కానీ ఇప్పటికి చాలా మందికి వ్యాక్సిన్ పై అనుమానాలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం వ్యాక్సిన్ కొరత ఉన్నప్పటికి వ్యాక్సినేషన్ ప్రక్రియను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే దేశంలో మొత్తం 18,29,26,460 మందికి వ్యాక్సిన్ అందించారు. కరోనా వ్యాక్సిన్ తీసుకున్న కొందరికి కరోనా సోకుతుండగా, మరికొందరు కరోనాతో మృతి చెందుతున్నారు. ఇలాంటి కేసులు అతి తక్కువగా నమోదవుతున్నాయి. అయితే, కరోనా వైరస్ కు వ్యాక్సిన్ తీసుకున్న వారిలో 97.38శాతం మందిలో రక్షణ వ్యవస్థ అభివృద్ధి చెందినట్టు తాజా అధ్యయనంలో వెల్లడైంది. కరోనా మహమ్మారి వైరస్ పై వ్యాక్సిన్ లు సమర్ధవంతంగా పనిచేస్తున్నాయని ఈ నివేదికలో వెల్లడైంది. అయితే ప్రస్తుతం వ్యాక్సిన్ ఉత్పత్తి పెంచడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది.

Related posts