telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

బోటువెలికితీసిన .. సత్యం బృందానికి సన్మానం..20లక్షల నజరానా..

satyam team appreciated with cash reward

గోదావరిలో మునిగిన బోటును బయటకు తెచ్చిన ధర్మాడి సత్యం బృందాన్ని జిల్లా కలెక్టర్ ఘనంగా సన్మానించారు. అనంతరం ఒప్పందం ప్రకారం సత్యంకు చెందిన బాలాజీ మెరైన్ సంస్థకు ఇవ్వాల్సిన 20 లక్షల రూపాయల చెక్‌ను కలెక్టర్ మురళీధర్ రెడ్డి అందజేశారు. సుడిగుండాల మధ్య చిక్కుకున్న రాయల్ వశిష్ట బోటును వెలికి తీసేందుకు అనేక ప్రయత్నాలు జరిగాయి. బోటులోనే మృతదేహాలు చిక్కుకోవడంతో దాన్ని వెలికి తీస్తేగాని మృతదేహాలు బయటకు రాని పరిస్థితి కనిపించింది. దీంతో బోటును వెలికి తీసేందుకు ఎన్డీఆర్ఎఫ్ తోపాటు ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సైతం ప్రయత్నాలు చేశాయి. గోదావరి ఉదృతి ఎక్కువగా ఉండడంతో వారి ప్రయత్నాలు విరమించుకున్నారు.

దీంతో బోటును వెలికి తీయడంపై పలు అనుమానాలు వెలిశాయి. బోటు బయటకు తీయడం కష్టమని తేల్చడంతో ఈ అనుమానాలు మరింత బలబడ్డాయి. దీంతో ప్రభుత్వం బోటును వెలికి తీసేందుకు కంకణం కట్టుకుంది. వెంటనే ధర్మాడి సత్యం బృందాన్ని రంగంలోకి దింపింది. దీంతో సాంప్రదాయ పద్దతిలో బోటును వెలికి తీసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. అయితే చివరికి విశాఖ నుండి మెరైన్ డైవర్స్ వచ్చి సహాయం చేశారు. డైవర్స్ నేరుగా ఆక్సిజన్ మాస్క్‌లతో నీళ్లలోకి దిగి బోటుకు నేరుగా లంగర్లు వేశారు. దీంతో సత్యం బృందంతో పాటు విశాఖ నుండి వచ్చిన వారి ప్రయత్నాలతో సుమారు ఆరురోజుల తర్వాత బోటు బయటపడింది.

Related posts