telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

విజయ్ దేవరకొండతో అనన్య… పిక్స్ వైరల్

Fighter

‘వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమా తరువాత యంగ్ హీరో విజయ్ దేవరకొండ నటిస్తోన్న ‘ఫైటర్’ సినిమా షూటింగ్ కొనసాగుతోంది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఛార్మి, పూరి జగన్నాథ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బాలీవుడ్‌ దర్శక నిర్మాత కరణ్‌ జొహార్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ పాన్‌ ఇండియా సినిమాలో హీరోయిన్‌గా బాలీవుడ్‌ నటిని తీసుకున్నారు. ఈ సినిమాలో ముందు జాన్వి కపూర్‌ని తీసుకోవాలని అనుకున్న విషయం తెలిసిందే. చివరకు బాలీవుడ్ హీరోయిన్‌ అనన్య పాండే ను హీరోయిన్ గా ఫిక్స్ చేసినట్లు ఆ సినిమా బృందం ప్రకటించింది. ఆమె బాలీవుడ్ నటుడు చుంకీ పాండే కుమార్తె. ఆమెకు స్వాగతం పలుకుతూ ఛార్మీ ట్వీట్ చేసింది.

Related posts