telugu navyamedia
సినిమా వార్తలు

బిగ్ బాస్ హౌస్‌లో అర్ధరాత్రి రోమన్స్..

బుల్లితెరపై ప్ర‌చార‌మ‌వుతున్న బిగ్ బాస్ సీజన్ 5 రియాల్టీ షోకు ఉన్న క్రేజ్ ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రోజురోజుకు రసావత్రరంగా సాగుతుంది. ఇప్పటికే ఇంట్లో ఉన్న 18మంది కంటెస్టెంట్స్ ఎక్కువ రోజులు ఉండటానికి తెగ కష్టపడుతున్నారు.బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్‌లను చాలా జాగ్రత్తగా ఆడుతూ.. ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేస్తున్నారు.

Bigg Boss 5 Telugu Lahari Shari: అసలు ఎవరు ఈ లహరి షారి.. ఎక్కడ్నుంచి బిగ్  బాస్‌కు వచ్చింది..?

గత వారం..పదిరోజులుగా రోజూ కొట్లాటలు.. టాస్కులు, సీరియస్ నెస్ తో నింపేసి.. చూసే జనాలకు చికాకు తెప్పించిన బిగ్ బాస్ షో.. ఈ వారాంతంలో కాస్త ఫన్ అండ్ రొమాన్స్ ట్రాక్ ఎక్కింది. ఇప్పటికే హమీదా- శ్రీరామ్ కు మధ్యలో ఎదో ఉందని అంతా అనుకుంటుండగా.. తాజాగా మరో జంట ఇప్పుడు హౌస్‌లో హాట్ టాపిక్‌గా మారారు.

12వ ఎపిసోడ్ ని కాస్త ఎంటర్ టైన్మెంట్ తో ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేశాడు బిగ్ బాస్. అలాగే లవ్ స్టోరీలు కూడా అదే విధంగా నడుస్తున్నాయి. ఎపిసోడ్ స్టార్ట్ అవగానే రెండు టీమ్ లకు అగ్గిపుల్లలు ఇచ్చి ఓ ట్రేలో ఇసుక ఉంచి అందులో అగ్గిపుల్లలు గుచ్చి వెలిగించాలని.. ఎవరి అగ్గిపుల్లలు చివరి వరకు ఆరిపోకుండా ఉంటే వారే గెలిచినట్టు అనేది టాస్క్. ఈ టాస్కులో ఎల్లో టీమ్ మీద పర్పుల్ టీమ్ విన్ అయింది. ఆ తర్వాత శ్వేత బర్త్ డే సందర్భంగా బిగ్ బాస్ ఇంటి సభ్యులందరికీ చాక్లెట్స్ పంపించారు.

Announcements: There are 5 Bigg Boss contestants - Heytamilcinema

అర్ధరాత్రి మానస్ ఒక్కడే గిన్నెలు కడుగుతుండగా.. లహరి మానస్ దగ్గరికి వచ్చింది. ఆ టైమ్ లో బ్లాక్ డ్రెస్ వేసుకున్న లహరిని చూసిన మానస్.. బ్లాక్ నీ ఫేవరెట్ కలరా అని అడిగాడు. దానికి లహరి హా.. ఫస్ట్ బ్లాక్, ఆ తర్వాత వైట్, థర్డ్ బ్లూ కలర్ అని చెప్పింది. దానికి హే.. నాకు బ్లూ కలర్ ఫేవరెట్ అంటూ బదులిచ్చాడు మానస్.

Manas Tight Hug to Lahari In Big Boss House

అర్ధరాత్రి మానస్, లహరి ఇద్దరే కిచెన్ లో మాట్లాడుకుంటుండగా.. శ్రీరామ్, సిరి, ప్రియాతో పాటు మిగతా వారు వీళ్లనే చూస్తూ గమనించారు. శ్రీరామ్ అయితే రెప్ప కూడా కొట్టకుండా వీళ్లనే చూడటంతో అది గమనించిన మానస్.. శ్రీరామ్ ను ఉడికించాలని హే.. లుక్స్ ఇస్తున్నావా? అంటూ లహరికి వినిపించేలా అన్నాడు. దానికి లహరి ఈ టైమ్ లో ఇక్కడ ఎవరున్నా వస్తాను. ఒక్కరు ఈ టైమ్ లో పని చేయాలంటే చిరాకుగా అనిపిస్తుంది కదా అంటూ మానస్ కి సపోర్ట్ గా మాట్లాడింది. వీళ్లిద్దరి మధ్య కన్వర్జేషన్ నడుస్తుండగా శ్రీరామ్ వీళ్ల దగ్గరికి వచ్చాడు. రెచ్చిపోయిన మానస్ లహరిని మరింత దగ్గరికి తీసుకొని ఏంటి లహరి పడుకుంటున్నావా? అంటూ దగ్గరికి తీసుకొని గట్టిగా హగ్ ఇచ్చాడు. దీంతో శ్రీరామ్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

Sriramachandra Bigg Boss 5 Archives - Gulte

లహరి.. మానస్ ని పిలుస్తూ నా బెడ్ వరకు రా అంటూ పిలిచి.. మైక్ తీసేసిమానస్ ని గట్టిగా కౌగిలించుకుంది. మానస్ కూడా లహరిని గట్టిగ హగ్ చేసుకొని మరీ గుడ్ నైట్ చెప్పాడు. ఇదంతా చూసిన మిగతా హౌజ్ మేట్స్ షాక్ కి గురయ్యారు. అయితే.. ఇదంతా బిగ్ బాస్ ప్లానా? లేక శ్రీరామ్ ని ఉడికించడానికి చేశారా అనేది తెలియాలి.

Related posts