telugu navyamedia
సినిమా వార్తలు

“మణికర్ణిక” పబ్లిక్ టాక్

Manikarnika

ఝాన్సీరాణి లక్ష్మీబాయి జీవితకథ ఆధారంగా కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న చారిత్రాత్మక చిత్రం “మణికర్ణిక”. ఈ సినిమాకి క్రిష్ దర్శకుడిగా వ్యవహరించి ఆ తరువాత తప్పుకున్నారు. దీంతో కంగనానే దర్శకత్వ బాధ్యతలు చేపట్టి ఈ చిత్రాన్ని పూర్తి చేసింది. ఇటీవల వదిలిన హిందీ ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. దీంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. గణతంత్య్ర దినోత్సవం సందర్భంగా జనవరి 25వ తేదీన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది.

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్ షోలు కొన్ని చోట్ల ప్రదర్శితం కావడంతో సినిమా ఎలా ఉందనే విషయాన్ని ప్రేక్షకులు సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. ఝాన్సీ లక్ష్మీభాయ్ పాత్రలో కంగనా జీవించిందని, తన పవర్ ఫుల్ యాక్షన్ తో కథకు ప్రాణం పోసిందని, సినిమా మొత్తం తన భుజాలపై నడిపించిందని, ఈ సినిమాతో మరో నేషనల్ అవార్డు అందుకోవడం ఖాయమని చెబుతున్నారు. ప్రథమార్థం కన్నా ద్వితీయార్థం అద్భుతంగా ఉందని అంటున్నారు. ఈ సినిమాలో అంకిత లోఖండే, జిస్షు సేన్ గుప్తా, అతుల్ కులకర్ణి, మిష్టి తదితరులు ఈ సినిమాలో కీలకపాత్రలో నటించారు.

 

Related posts