telugu navyamedia
సినిమా వార్తలు

ఆసక్తికరంగా మర్డర్ మిస్టరీ “బైపాస్ రోడ్” ట్రైలర్

Bypass

బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముఖేశ్ తాజాగా నటిస్తోన్న మర్డర్ మిస్టరీ చిత్రం “బైపాస్ రోడ్”. నీల్ నితిన్ ముఖేశ్ సోదరుడు నమన్ నితిన్ ముఖేశ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. తాజా ప్రాజెక్టులో ఆదాశర్మ హీరోయిన్ గా నటిస్తోంది. టీవీ నటి శర్మ సికందర్ సారా అనే అమ్మాయి పాత్రలో నటిస్తోంది. సారా హత్య కేసుకు సంబంధించిన మిస్టరీని ఛేదించే నేపథ్యంలో… ఆసక్తికరంగా, యాక్షన్ సన్నివేశాలతో సాగే ట్రైలర్ ఉత్కంఠగా సాగుతోంది. రజిత్ కపూర్ నీల్ నితిన్ ముఖేశ్ తండ్రి పాత్రలో కనిపించనుండగా..గుల్ పనాగ్ పినతల్లిగా నటిస్తోంది. “బైపాస్ రోడ్” సినిమాకు కథ, స్ర్కీన్ ప్లే, సంభాషణలు నీల్ నితిన్ ముఖేశ్ అందిస్తున్నాడు. ఈ చిత్రం నవంబర్ 1న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ ట్రైలర్ ను మీరు కూడా వీక్షించండి.

Related posts