telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మే 8న “క్రాక్”గా వస్తున్న రవితేజ

Krack

మాస్ మహారాజా రవితేజ, గోపిచంద్ మలినేని కాంబోలో రూపొందుతున్న సినిమా ‘క్రాక్’.. హీరోగా రవితేజ 66వ సినిమా ఇది. రవితేజ పవర్‌ఫుల్ పోలీస్ పాత్రలో కనిపించనున్న ఈ సినిమాలో శృతి హాసన్ కథానాయికగా నటిస్తుండగా.. తమిళ నటుడు, దర్శకుడు సముద్రఖని, వరలక్ష్మీ శరత్ కుమార్ ఇంపార్టెంట్ రోల్స్ చేస్తున్నారు. జనవరి 26 రవితేజ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటిస్తూ న్యూ పోస్టర్ రిలీజ్ చేశారు. రవితేజ పోలీస్ గెటప్‌లో సరికొత్తగా కనిపిస్తున్నాడు. మే 8న ప్రపంచ వ్యాప్తంగా ‘క్రాక్’ చిత్రాన్ని భారీగా విడుదల చేయనున్నారు. తెలుగు రాష్ట్రాల్లో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా ఒక ఇంటెన్స్ స్టోరీతో ఈ సినిమా తెరకెక్కుతోంది. సరస్వతి ఫిలిమ్స్ డివిజన్ పతాకంపై బి.మధు నిర్మిస్తున్న ఈ సినిమాకి ఎస్. థమన్ సంగీతం అందిస్తున్నారు. ‘మెర్సల్’, ‘బిగిల్’ వంటి సూపర్ హిట్ తమిళ సినిమాలకు పనిచేసిన జి.కె. విష్ణు ‘క్రాక్’కు డీఓపీగా పనిచేస్తున్నారు. ‘డాన్ శీను’, ‘బలుపు’ తర్వాత గోపిచంద్ మలినేని రవితేజతో హ్యాట్రిక్‌కి రెడీ అయ్యాడు. మరి రవితేజ ఈ చిత్రంతో మంచి విజయాన్ని అందుకోవాలని కోరుకుందాం.

Related posts