telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

శ్రీవారి భక్తులకు షాక్‌…టీటీడీ మరో సంచలన నిర్ణయం

tirumala guest house

ఏపీలో కరోనా ఉధృతి పెరుగుతూ ఉంది. ఇప్పటికే ఏపీలో 9 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యశాఖ కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది. ఈ బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో ఏపీలో కొత్తగా 1,941 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 9,10,943 కు చేరింది. ఇందులో 9,10,943 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 11,809 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.  అటు తిరుమలలోనూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. కొవిడ్‌ వ్యాప్తి దృష్ట్యా టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవారి టైమ్ స్లాట్ సర్వదర్శన టోకెన్ల జారీని సోమవారం నుంచి పూర్తిగా నిలిపివేస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్, విష్ణు నివాసం వద్ద భక్తులకు సర్వదర్శనం టోకెన్లను జారీ చేస్తున్నారు. అయితే..ఈ కౌంటర్ల క్యూలైన్ల వద్దకు భక్తులు గుంపులుగా చేరుతుండటంతో కరోనా వ్యాపించే ప్రమాదం పొంచి ఉందని టీటీడీ భావించింది. భక్తుల ఆరోగ్య భద్రత దృష్ట్యా సర్వదర్శన టైమ్ స్లాట్ టోకెన్లను ఈనెల 11వ తేదీ సాయంత్రం వరకు మాత్రమే జారీ చేస్తామని తెలిపింది. 12వ తేదీ నుంచి పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. తదుపరి సర్వదర్శన టోకెన్ల జారీపై వివరాలను ముందుగానే తెలియజేస్తామంది. 3 వందల రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనాలు కొనసాగుతాయని టీటీడీ స్పష్టంచేసింది.

Related posts