telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఆయన సీఎం అయితేనే రజినీకాంత్ పార్టీలో చేరతా…: రాఘవ లారెన్స్

Raghava

తమిళనాట రజనీకాంత్‌ రాజకీయ ప్రవేశంపై సందిగ్ధత నెలకొన్న విషయం తెలిసిందే. గత మూడేళ్లుగా ఆయన పార్టీ పెడతారంటూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. రానున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నాటికి ఆయన పార్టీ ప్రకటిస్తారని రజనీ సన్నిహితుల ద్వారా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే దక్షిణాది ప్రముఖ దర్శకుడు, నటుడు రాఘవా లారెన్స్‌ ఇటీవల చేసిన ఓ ప్రకటన తమిళనాడు రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. “నా గురువు గారు రజనీకాంత్‌ పార్టీ ప్రకటన అనంతరం ఆయన బాటలో నడుస్తాం. ఆయన పార్టీలో చేరతాను. రజనీకాంత్‌ మాత్రమే విపక్ష నాయకులపై విమర్శలు చేయకుండా రాజకీయాలు చేయగలరు. అందునే నేను ఆయన దారిలో నడవాలి అని నిర్ణయించుకున్నా” అంటూ ట్వీట్ చేశారు. అయితే పార్టీలో అనుభవం వున్న వ్యక్తిని సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తానని, తను ముఖ్యమంత్రి అభ్యర్థిని కానని గతంలో రజనీ చెప్పిన విషయం తెలిసిందే. అయితే తన నిర్ణయాన్ని రజినీ వెనక్కి తీసుకోవాలని కోరుతూ లారెన్స్ తాజాగా ఓ ట్వీట్ చేశాడు. దీంతో రజినీ పార్టీలో చేరడానికి లారెన్స్ ఓ షరతు విధించాడు. రజినీకాంత్ సీఎం అభ్యర్థి అయితేనే తాను పార్టీలో చేరతానని, వేరే వ్యక్తి అయితే అందుకు తాను అంగీకరించబోనని లారెన్స్ స్పష్టం చేయడం ఆసక్తికరంగా మారింది.

Related posts