telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“ఇర్‌లోనే సవాల్‌…” సిక్స్ ప్యాక్ తో ఆర్య … పిక్స్ వైరల్

Arya

“తమిళ హీరో ఆర్య తాజాగా తన కొత్త సినిమాకోసం విపరీతంగా కష్టపడుతున్నాడు. ఆర్య వర్కవుట్ చేస్తున్న పిక్స్, వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సూపర్ స్టార్ రజనీకాంత్‌తో ‘కబాలి’, ‘కాలా’ సినిమాలు చేసిన యంగ్ డైరెక్టర్ పా రంజిత్ దర్శకత్వంలో ఆర్య ఓ సినిమా చేయనున్నాడు. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో నిజమైన బాక్సర్‌గా కనిపించడం కోసం ఆర్య గంటల తరబడి జిమ్‌లో వర్కౌట్స్ చేస్తున్నాడు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియో తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్ చేశాడు. “ఇది నా కెరీర్‌లోనే సవాల్‌తో కూడుకున్న సినిమా. అందుకోసం బాక్సింగ్ రింగ్‌లో ప్రత్యర్థిని ఎదుర్కోవడానికి సిద్ధమయ్యాను” అంటూ కొత్త సినిమా కోసం పడుతున్న కష్టాన్ని ప్రేక్షకులకు తెలిపాడు. మెలితిరిగన కండలతో, సిక్స్ ప్యాక్ బాడీతో, మీసాలతో కొత్త లుక్‌లో ఆర్య అదుర్స్ అంటున్నారు ఫ్యాన్స్. ఈ సినిమాకు అన్బు అరివు యాక్షన్ కంపోజ్ చేస్తుండగా, సంతోష్ సంగీతమందిస్తున్నారు. త్వరలో షూటింగ్ ప్రారంభం కానుంది.

Related posts