telugu navyamedia
సినిమా వార్తలు

అవెంజర్స్ ఎఫెక్ట్… “అర్జున్ సురవరం” వాయిదా

Arjun-Suravaram

యంగ్ హీరో నిఖిల్ నటించిన “అర్జున్ సురవరం” ఈ సినిమా వాయిదా పడుతూనే ఉంది. ఎట్టకేలకు మే 1న సినిమాను విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. అయితే ఇప్పుడు మరోసారి సినిమా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. దానికి కారణం ‘అవెంజర్స్: ఎండ్ గేమ్’ అని తెలుస్తోంది. హాలీవుడ్ కు చెందిన ఈ సినిమా కోసం ఇండియన్ ఆడియన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. రేపే ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమా దాటిని తట్టుకోలేక “అర్జున్ సురవరం” సినిమాను వాయిదా వేస్తున్నట్లు హీరో నిఖిల్ వెల్లడించాడు.
ఈ సందర్భంగా నిఖిల్ తన అభిమానులకు సారీ చెబుతూ ”ఒక సంవత్సరం గ్యాప్.. మంచి సినిమాతో ఒక మంచి పాయింట్‌తో నాతో పాటు చాలా మంది టెక్నీషియన్స్ చాలా కష్టపడి కార్మిక దినోత్సవం రోజు మీ అందరి అభిమానం కోసం రావడానికి ఎదురుచూస్తున్న టైమ్‌లో అవేంజెర్స్ లాంటి ఎదురుదెబ్బ.. ఎలా ఐతే అవెంజర్స్ ధానోస్‌ని ఎదిరించి ప్రపంచం కోసం పోరాడుతారో.. అర్జున్ సురవరం కూడా స్టూడెంట్స్ కోసం పోరాడతాడు. ఇలాంటి ఒక పాయింట్ ఉన్న సినిమాని చూసి నచ్చి కొనుక్కున్న డిస్ట్రిబ్యూటర్స్ సలహా మేరకు వాయిదా వేస్తున్నాం” అంటూ పోస్ట్ చేశారు.

Related posts