telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

పబ్లిక్‌ ఫిగర్‌ కాబట్టే విమర్శలు… బాయ్ ఫ్రెండ్ కు క్షమాపణలు చెప్పిన హీరోయిన్

Ankita-Lokhande

బాలీవుడ్ నటి అంకితా లోఖండే మాజీ లవర్ సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య తర్వాత అంకిత తరచుగా వార్తల్లో నిలుస్తోంది. మొదటి నుంచి సుశాంత్ కుటుంబ సభ్యులు చేస్తున్న ఆరోపణలకు సపోర్ట్ చేస్తూ వచ్చిన ఆమె, సుశాంత్‌ ఆ‍త్మహత్య చేసుకోవడానికి గల కారణాలు వెలికి తీయాలని డిమాండ్ చేసింది. సుశాంత్‌ కేసును సీబీఐకి అప్పగించాల్సిందిగా అప్పట్లో ఆమె కోరడం సంచలనంగా మారింది. అయితే అంకితకు మద్దతు కొందరు అండగా నిలవగా, ఓ వర్గం నుంచి విమర్శలు ఎదురయ్యాయి. ఈ క్రమంలో కొందరు విక్కి జైన్‌ అకింతకు తగినవాడు కాదంటూ ట్రోల్‌ చేసి రచ్చరచ్చ చేశారు. తాజాగా అంకితా లోఖండే తన బాయ్‌ఫ్రెండ్ విక్కిజైన్ గురించి పోస్ట్ పెడుతూ ఎమోషనల్ కామెంట్స్ చేసింది. విక్కిజైన్ తనలాంటి పబ్లిక్‌ ఫిగర్‌తో కలిసి ఉండటం వల్లే విమర్శలు ఎదుర్కొంటున్నాడని, లేకుంటే అతనిపై ఈ ట్రోలింగ్ జరిగేది కాదని అందుకు గాను ఆయనకు క్షమాపణలు చెబుతున్నానని ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా సందేశమిచ్చింది. “నీ లాంటి మంచి వ్యక్తిని నా స్నేహితుడిగా, భాగస్వామిగా, సోల్‌మెట్‌గా పంపినందుకు దేవుడికి కృతజ్ఞతలు చెబుతున్నా. అన్నివేళలా నీవు తోడుగా నిలిచావు. నీ గురించి చెప్పడానికి మాటలు రావడం లేదు” అని అంకిత తెలిపింది.

Related posts