సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్‌పై మెగాస్టార్ చిరంజీవి తొలి చారిత్రక చిత్రం “సైరా నరసింహారెడ్డి” వెండితెరపై ప్రేక్షకులను మెప్పిస్తోంది. రామ్ చరణ్ నిర్మించిన ఈ సినిమా అక్టోబర్ 2న గాంధీ జయంతి రోజు ప్రపంచ వ్యాప్తంగా 5 భారతీయ భాషల్లో విడుదలైన విషయం తెలిసిందే. అత్యంత ప్రతిష్టాత్మకంగా అమితాబ్, కిచ్చా సుదీప్, విజయ్ సేతుపతి, జగపతి బాబు, అనుష్క, తమన్నా, నయనతార లాంటి భారీ తారాగణంతో రూపొందించారు. తొలితరం స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన “సైరా” చిత్రాన్ని దేశ వ్యాప్తంగా విడుదల చేశారు. తాజాగా ఈ చిత్రం నార్త్‌అమెరికాలో 2.5మిలియన్ డాలర్లు (సుమారు రూ.18కోట్లు) వసూలు చేసింది. దీంతో ఉత్తర అమెరికాలో మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లోనే బెస్ట్ కలెక్షన్లు సాధించిన చిత్రంగా “సైరా” నిలిచింది. అంతేగాక ఓవర్సీస్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు చిత్రాల జాబితాలో 8వ స్థానానికి ఎగబాకింది. మరో పదిరోజులపాటు “సైరా” బిజినెస్ ఉంటుందని సినీ విశ్లేషకులంటున్నారు.
ఓవర్సీస్‌లో అత్యధిక కలెక్షన్లు సాధించిన తెలుగు చిత్రాలివే..
1. బాహుబలి 2: ద కంక్లూజన్ – 20.5మిలియన్ డాలర్లు, 2. బాహుబలి: ద బిగినింగ్ – 6.9మిలియన్ డాలర్లు, 3. రంగస్థలం – 3.51మిలియన్ డాలర్లు, 4. భరత్ అనే నేను – 3.4మిలియన్ డాలర్లు, 5. సాహో – 3.2మిలియన్ డాలర్లు, 6. శ్రీమంతుడు – 2.9మిలియన్ డాలర్లు, 7. మహానటి – 2.54మిలియన్ డాలర్లు, 8. సైరా నరసింహారెడ్డి – 2.5మిలియన్ డాలర్లు, 9. గీతగోవిందం – 2.46మిలియన్ డాలర్లు, 10. అ..ఆ! – 2.44మిలియన్ డాలర్లు. మరి ఈ చిత్రం మరిన్ని వసూళ్లు రాబడుతుందేమో చూడాలి.
జగన్ కు అనుభవం లేదు… మార్పు మంచిదే… హీరో కామెంట్స్