telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ సామాజిక

శారదా పీఠానికి .. ఏపీసీఎం..

apcm jagan will visit visaka sarada pitham

ఏపీసీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి రేపు విశాఖలో పర్యటించనున్నారు. ఈ ఐదేళ్లలో తాను ప్రజలకు ఇచ్చిన మాట తప్పకుండా నెరవేర్చేందుకు కృషి చేస్తానంటున్నారు. గత ప్రభుత్వ హయాంలో దుబారా అయిన ఖర్చులన్నీ ఒక్కో పైసా బయటకు వచ్చేలా చేస్తానని..అందుకు సమర్థవంతమైన పాలన మండలని ఏర్పాటు చేయబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే సిన్సియన్ ఐపీఎస్, ఐఏఎస్ ఇతర అధికారుల నియమకాలు మొదలయ్యాయి. కొంత కాలంగా జగన్ ఏ కార్యక్రమాలు మొదలు పెట్టినా ఆద్యాత్మిక విషయాలపై ఎక్కువ దృష్టి పెడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఆద్యాత్మకి గురువులను కలుస్తున్నారు. ఈ నేపథ్యంలో రేపు విశాఖకు జగన్ మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం కోసమే స్వామి సలహాలు, సూచనలు తీసుకోనున్న జగన్వి శాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద స్వామిని ప్రత్యేకంగా కలవాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయించారు.

రేపే విశాఖ పర్యటన ఖరారైందని సీఎం కార్యాలయ వర్గాలు ఇప్పటికే వెల్లడించాయి. రేపు విశాఖ చేరుకునే ఆయన, స్వరూపానందను దర్శించుకోను న్నారు. ఆపై తిరిగి అమరావతి చేరుకుంటారు. మంత్రివర్గ విస్తరణపై కసరత్తు చేస్తున్న జగన్, ముహూర్తంపై స్వామి సలహాలు, సూచనలు తీసుకోనున్నారని తెలుస్తోంది. దీనితో పాటు అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన తరువాత జగన్, స్వరూపానందను దర్శించుకోలేదు. జగన్ ప్రమాణ స్వీకారానికి ముహూర్తాన్ని కూడా స్వరూపానంద పెట్టారు. ఈ నేపథ్యంలో ఆయన్ను కలిసి కృతజ్ఞతలు తెలియజేయాలని జగన్ నిర్ణయించుకున్నారు.

Related posts