ఏపీ కేబినెట్ సమావేశం ఈరోజు ఉదయం 10.30 గంటల తర్వాత ప్రారంభం కానుంది. సీఎం జగన్ ఆధ్వర్యంలో జరగనున్న ఈ సమావేశంలో పదిహేను కీలక అంశాలు ఎజెండాలో ఉండడంతో సుదీర్ఘంగా చర్చ జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. సంక్షేమ పథకాలే ప్రధాన అజెండాగా నిలవబోతున్నాయి.
కార్పొరేషన్లు, బోర్డు ఏర్పాటు, స్థానిక సంస్థలకు ఎన్నికల నిర్వహణ వంటి అంశాలతోపాటు చేనేత కార్మికులకు ఆర్థిక సాయం అందించడంపై ప్రధానంగా చర్చ జరగనున్నది. ఔట్ సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. వాటర్‌గ్రిడ్, అమ్మ ఒడి పథకం, ఉద్యోగాల భర్తీపై కూడా సమావేశంలో చర్చించనున్నారు. అలాగే వివాదాస్పదంగా ఉన్న పోలవరం, రాజధాని నిర్మాణం, పీపీఏలపైనా చర్చ జరిగే అవకాశం ఉంది.