telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ వార్తలు

పెన్షన్ దారులకు గుడ్ న్యూస్

Peddireddy

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీకి సర్వం సిద్ధం చేసింది. సెప్టెంబర్‌ 1వ తేదీనే పెన్షన్లు పంపిణీ చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 61.68 లక్షల మంది లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు మంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి. కరోనా వల్ల బయోమెట్రిక్‌ బదులు జియో ట్యాగింగ్ ఫొటోలు తీసుకొనున్నట్టు వెల్లడించారు. ఫించన్ల పంపిణీ కోసం రూ.1496.07 కోట్లు ఇప్పటికే ప్రభుత్వం విడుదల చేసినట్టు వెల్లడించారు. ఈ నెల నుంచి కొత్తగా 90,167 మందికి పెన్షన్లు ఇవ్వనున్నట్టు తెలిపారు. కొత్త పెన్షన్‌దారుల కోసం రూ.21.36 కోట్లు కేటాయించినట్టు చెప్పుకొచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా లబ్ధిదారుల చేతికే 2.68 లక్షల మంది వాలంటీర్లు పెన్షన్లు అందిస్తారని వెల్లడించారు మంత్రి పెద్దిరెడ్డి. కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తుండడంతో రోజురోజుకూ దేశవ్యాప్తంగా కేసుల సంఖ్య పెరుగుతోంది. ప్రజలు సరైన జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ కరోనా బారిన పడుతుండడం ఆందోళన కలిగించే విషయామే. ఇలాంటి సంక్షోభ సమయంలో కూడా సంక్షేమ పథకాల విషయంలో వెనుకడుగు వేయడంలేదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.

Related posts