రోహిత్ శర్మ పేరు చెప్పాగానే సిక్స్, ఫోర్లే గుర్తుకు వస్తాయి. ఎందుకంటే రోహిత్ ఓపెనింగ్ బ్యాటింగ్‌కు దిగాడంటే ప్రత్యర్థి జట్టుకు చుక్కలే కనిపిస్తాయి. టీం ఇండియా ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్‌గా ఎన్నో రికార్డులు కొల్లగొట్టిన రోహిత్… తాజాగా మరో రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు. అంతర్జాతీయ టీ20లో రోహిత్ శర్మ టాప్-2లోకి దూసుకొచ్చాడు. అయితే ఇక్కడ చెప్పుకునేది ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ మాత్రం కాదు. టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో రోహిత్ 2 వ స్థానానికి దూసుకురాగా..కెప్టెన్ కోహ్లీ తొలి స్థానంలో ఉన్నాడు. ఇంగ్లండ్‌తో నిన్న జరిగిన ఐదో టీ20లో 34 బంతులాడిన రోహిత్ శర్మ 4 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 64 పరుగులు చేశాడు. ఈ క్రమంలో అంతర్జాతీయ టీ20 ల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్ జాబితాలో రోహిత్ శర్మ రెండో స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. కాగా… అంతర్జాతీయ టీ 20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాను ఓసారి పరిశీలిస్తే.. టీం ఇండియా కెప్టెన్ కోహ్లీ టాప్‌లో కొనసాగుతున్నాడు. ఆ తర్వాత గప్టిల్ ఉన్నాడు. అయితే తాజాగా రోహిత్ హాఫ్ సెంచరీతో రాణించి గప్టిల్ ను మూడో స్థానానికి నెట్టేశాడు. ఇక రోహిత్ శర్మ ఇప్పటివరకు 111 టీ20 మ్యాచ్‌లాడి 2864 పరుగులు చేశాడు. ఇందులో 4 సెంచరీలు, 22 హాఫ్ సెంచరీలున్నాయి.
previous post
మోడీ సమావేశాలు పెట్టుకుంటే తప్పు లేదా: చంద్రబాబు