telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

‘రాములో రాముల’ ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్

ala-vikuntapuramlo

‘అల వైకుంఠపురములో’ సినిమాలోని మాస్ సాంగ్ ‘రాములో రాముల’ ఫుల్ వీడియో విడుదలైంది. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన ఈ చిత్రం నాన్ బాహుబలి రికార్డులన్నింటినీ కొల్లగొట్టింది. ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను గీతా ఆర్ట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లపై అల్లు అరవింద్, ఎస్.రాధాకృష్ణ సంయుక్తంగా నిర్మించారు. తమన్ సంగీతం అందించారు. ‘సామజవరగమన’, ‘బుట్టబొమ్మ’, ‘రాములో రాముల’ పాటలు జనాల నోటిలో బాగా నానాయి. ‘సామజవరగమన’ పాట అయితే సాంగ్ ఆఫ్ ది ఇయర్‌గా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక ‘రాములో రాముల’ పాట అయితే తెలంగాణ యాసలో సాగుతూ ఆల్బమ్‌లో మంచి మాస్ సాంగ్‌గా నిలిచింది. ఈ పాటలో దోసె స్టెప్ బాగా పాపులర్ అయ్యింది. ఇప్పటికే ‘సామజవరగమన’, ‘బుట్టబొమ్మ’ ఫుల్ వీడియో సాంగ్స్‌ని విడుదల చేశారు. తాజాగా ‘రాములో రాముల’ వీడియో సాంగ్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ప్రస్తుతం ఈ సాంగ్ యూట్యూబ్‌లో దూసుకుపోతోంది.

Related posts