telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

శూర్పణఖగా మారిన రెజీనా… ‘నేనే నా..?!’ ఫస్ట్ లుక్ రిలీజ్

rejina

‘ఎస్ఎంఎస్’ సినిమా ద్వారా టాలీవుడ్‌కు పరిచయమైన ఈ చెన్నై బ్యూటీ మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం తమిళంలో వరుస సినిమాలతో బిజీగా ఉన్న రెజీనా ఇప్పుడు మరో మిస్టరీ థ్రిల్లర్‌తో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. రెజీనా ప్రధాన పాత్రలో నటిస్తోన్న మిస్టరీ థ్రిల్లర్ ‘నేనే నా..?!’. తెలుగు, తమిళ భాషల్లో సినిమా రూపొందుతుంది. ‘నిను వీడ‌ని నీడ‌ను నేనే’ సినిమాతో సూప‌ర్‌హిట్ అందుకుని తన ప్రత్యేక‌త‌ను చాటుకున్న ద‌ర్శకుడు కార్తీక్ రాజు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మంగ‌ళ‌వారం విడుద‌ల చేశారు. ఇనుప చువ్వల మ‌ద్య బంధీగా ఉన్న మ‌హారాణి పాత్రధారిగా రెజీనా లుక్‌ టెర్రిఫిక్‌గా ఉంది. తమిళ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు. తమిళంలో ఈ చిత్రానికి ‘శూర్పణగై’ అనే టైటిల్ పెట్టారు. అంటే, తెలుగులో శూర్పణఖ అని అర్థం. ఈ సినిమాను సామ్ సీఎస్ సంగీతం సమకూరుస్తు్న్నారు. పీకే వర్మ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. కాగా, ఫస్ట్ లుక్ విడుదల సందర్భంగా నిర్మాత రాజ‌శేఖ‌ర్ వ‌ర్మ మాట్లాడుతూ.. ‘‘మిస్టరీ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ‘నేనే నా..?!’ సినిమాను కార్తీక్ రాజు అద్భుతంగా తెర‌కెక్కిస్తున్నారు. ఈరోజు వ‌రుణ్‌ తేజ్‌ మా సినిమాలోని రెజీనా లుక్‌ను విడుద‌ల చేశారు. ఆయ‌నకు మా యూనిట్ త‌ర‌పున స్పెష‌ల్ థాంక్స్‌. రెజీనా లుక్‌కి చాలా మంచి స్పంద‌న వ‌స్తోంది. శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటోన్న ఈ చిత్రంలో రెజీనా ఆర్కియాల‌జిస్ట్‌గా క‌న‌ప‌డ‌తారు. న‌టిగా ఆమెను మ‌రో యాంగిల్‌లో ఆవిష్కరిస్తున్న చిత్రమిది.

Related posts