telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నాగశౌర్య, సౌజన్య చిత్రానికి ఆసక్తికర టైటిల్ ?

Naga-shourya

యంగ్ హీరో నాగశౌర్య ప్రస్తుతం శ్రీ వెంకటేశ్వర సినిమాస్, నార్త్ స్టార్ ఎంటెర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై ధీరేంద్ర సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో ఓ స్పోర్ట్స్ డ్రామాలో నటిస్తున్నాడు. ఇందులో నాగ శౌర్య కు జంటగా కేతిక శర్మ నటిస్తుంది. ఈ సినిమా నుంచి ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ సినిమా తర్వాత సౌజన్య దర్శకత్వంలో ఓ రొమాంటిక్ ఎంటర్ టైనర్ చేస్తున్నాడు. ఈ చిత్రం షూట్ ప్రస్తుతం హైదరాబాద్ పరిసరాల్లో జరుగుతోంది. ఈ సినిమాలో శౌర్య సరసన పెళ్లిచూపులు ఫెమ్ రీతువర్మ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాకు ఇంట్రస్టింగ్ టైటిల్ ను ఫిక్స్ చేసారని తెలుస్తుంది. ఈ సినిమాకు “వరుడు కావలెను” అనే టైటిల్ ను పెట్టారని టాక్. త్వరలోనే టైటిల్ ను అఫీషియల్ గా అనౌన్స్ చేయనున్నారట. ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తుండగా.. సితార ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది. వచ్చే ఏడాది వేసవికి మూవీ విడుదల చేయాలనీ సన్నాహాలు చేస్తున్నారు. కాగా ఇది లైన్ లో ఉండగానే నాగశౌర్య హీరోగా టాలెంటెడ్ దర్శకుడు అనీష్ కృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా ఇటీవలే కన్ఫామ్ అయిన విషయం తెలిసిందే. గత కొన్నాళ్ల కితమే ప్రకటించబడిన ఈ చిత్రం ఇటీవలే పూజా కార్యక్రమంతో లాంచ్ అయ్యింది.

Related posts