telugu navyamedia
సినిమా వార్తలు

తల్లి కాబోతున్న ప్రియాంక చోప్రా… షాక్ లో తల్లి…!?

Priyanka-Chopra

గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. గతేడాది నిక్ జోనస్ ను వివాహం చేసుకున్న ఈ అమ్మడు ప్రస్తుతం హాలీవుడ్, బాలీవుడ్ సినిమాలతో చాలా బిజీగా ఉంది. ఇటీవల న్యూయార్క్ లో జరిగిన ఓ ఫ్యాషన్ ఈవెంట్ కు హాజరైన ప్రియాంక చోప్రా వెరైటీ డ్రెస్ తో మెరిసింది. ఆ ఫోటోలు కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఎందుకంటే ఆ ఫొటోలో ప్రియాంక చోప్రా లావుగా, గర్భం దాల్చినట్టుగా కన్పించింది. ఇదే విషయాన్ని పలు పత్రికలు కూడా ప్రస్తావించాయి. దీంతో ఈ విషయంపై ప్రియాంక చోప్రా తల్లి మధు చోప్రా స్పందించారు.

ప్రియాంక తల్లి కాబోతోందనే వార్త అవాస్తవం అని స్పష్టం చేశారు. ఆ వార్తలను విని వెంటనే షాకయ్యానని, ఇలాంటి వార్తలను ప్రచురించొద్దు అంటూ కోరింది. కెమెరా యాంగిల్ వలనే ప్రియాంక లావుగా, గర్భం దాల్చినట్టుగా ఉందని క్లారిటీ ఇచ్చారు. ఇక ప్రియాంక “ఈజెంట్ ఇట్‌ రొమాంటిక్‌” అనే హాలీవుడ్ చిత్రంలో నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్‌ పనుల్లో బిజీగా ఉంది. బాలీవుడ్ లో “ది స్కై ఈజ్‌ పింక్‌” అనే చిత్రంలో నటిస్తుంది ప్రియాంక‌.

Related posts