ప్రముఖ హాస్య నటుడు సునీల్ ఇటీవల తన గేర్ మార్చి హీరోగా మారిన సంగతి తెలిసిందే. కాని వరుస పరాజయాలు హీరోగా కాస్త గ్యాప్ తీసుకునేందుకు దోహదం చేశాయి. అయితే అన్నిన ప్లాప్‌లు అందుకున్న హీరోగా సునీల్ పరిశ్రమలో ఉన్నా అతడికి ఇంకా హీరోగా అవకాశాలు వస్తున్నాయి. మర్యాదరామన్న లాంటి భారీ హిట్‌కోసం ఎదురుచూస్తున్నాడు. అందులో భాగంగా అటువంటి కథ కోసం వెతుకుతున్నాడు. ఈ వెయిటింగ్‌కు ఫుల్‌స్టాప్ పెట్టాలంటే కొత్త కథతో ప్రయోగం చేయాల్సిందే. దాంతో ఇప్పుడు సరికొత్త కథతో డిటెక్టివ్‌గా మన ముందుకు రానున్నాడు. కనబడుటలేదు అన్న పేరుతో ఈ సినిమా తెరకెక్కనుంది. ఇందులో సునీల్ డిటెక్టివ్ రామకృష్ణ పాత్రలో కనిపించనున్నాడు. నేడు సంక్రాంతి సందడి చేసేందుకు ఈ చిత్ర యూనిట్ సరికొత్త పోస్టర్ విడుదల చేసింది. ఈ పోస్టర్‌లో దేనికోసం వెతుకుతున్నట్లు సునీల్ కనిపిస్తున్నాడు. అది కూడా చీకటి గదిలో టార్చిలైట్ పట్టుకొని డిటెక్టివ్ పాత్రలో కనిపిస్తున్నాడు. ఈ సినిమా అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తుందని కూడా ఈ పోస్టర్ ద్వారా సినీ టీం తెలిపుతోంది. మరి ఈ సినిమాతోనైనా సునీల్ హీరోగా ఆకట్టుకుంటాడా అనేది చూడాలి.
previous post
next post
మా బాస్ ని ఎలా సాటిస్ఫై చేస్తారు ?… బిగ్ బాస్ పై కమిట్మెంట్ ఆరోపణలు