telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“శ్యామ్ సింగరాయ్”లో నారారోహిత్ గెస్ట్ రోల్ ?

Vijay Shyam Singa Rai

నేచురల్ స్టార్ నాని రాహుల్‌ సాంకృత్యన్‌ దర్శకత్వంలో ‘శ్యామ్ సింగరాయ్’ అనే చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం కరోనా కారణంగా షూటింగ్ ఆగిపోయింది. కోల్‌కతా నేపథ్యంలో వాస్తవంగా జరిగిన సంఘటన ఆధారంగా ఈ మూవీని నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్‌ నిర్మిస్తోంది. ఇందులో సాయి పల్లవి, ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్లుగా నటిస్తుండగా, మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం డిసెంబర్‌ నుంచి సెట్స్ మీదకు వెళ్లనుంది. కాగా ఈ సినిమా గురించి ఒక ఇంట్రస్టింగ్ అప్ డేట్ వినిపిస్తోంది. ‘శ్యామ్ సింగ రాయ్’ క్లైమాక్స్ లో వచ్చే ఓ గెస్ట్ రోల్ లో మరో హీరో కనిపించబోతున్నాడు. నారా రోహిత్ ఈ సినిమాలో గెస్ట్ రోల్ చేయబోతున్నాడు. సినిమాకే ఎంతో కీలకమైన ఈ రోల్ లో రోహిత్ అయితేనే బాగుంటుందని చిత్రబృందం నారా రోహిత్ ను అప్రోచ్ అయింది. ఇక గతంలో కూడా రోహిత్ పలు సినిమాల్లో గెస్ట్ రోల్స్ చేసిన సంగతి తెలిసిందే. కాగా నాని ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో ‘టక్‌ జగదీష్‌’లో నటిస్తున్నారు. ఇందులో రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్ నానితో జోడీ కడుతున్నారు. షైన్ స్క్రీన్స్‌ సంస్థ నిర్మిస్తోన్న ఈ మూవీకి థమన్ సంగీతం అందిస్తున్నారు.

Related posts