telugu navyamedia
సినిమా వార్తలు

మంత్రిగా మీకు, మీ డ్రైవర్ కు తేడా లేదా ?- పేర్ని నానికి ఆర్జీవీ కౌంటర్

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో సినిమా టికెట్ రేట్స్ పై చిత్ర‌ప‌రిశ్ర‌మ వెర్సెస్‌ ఏపీ ప్ర‌భుత్వం వివాదం రోజు రోజుకి ముదురుతోంది. గత కొద్ది రోజులుగా సినీ ప్రముఖులకు..ప్ర‌భుత్వానికి మధ్య తీవ్రస్థాయిలో రచ్చ జరుగుతుంది.

ఈ క్ర‌మంలో వివాదాస్పద దర్శకుడు వర్మకు ఏపీ సినిమాట్రోగ్రఫీ మంత్రి పేర్ని నానికి మధ్య ట్వీట్ట‌ర్‌ మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజా ట్వీట్ లో మంత్రిగా మీకు, మీ డ్రైవర్ కు తేడా లేదా ? అంటూ ప్రశ్నించడం హాట్ టాపిక్ గా మారింది.

‘హీరోలకు నిర్మాతలు ఇచ్చే రెమ్యూనరేషన్‌కు ఒక ఫార్ములా చెప్పారు. మీరు ఏ హీరోకు ఎంత ఇస్తారు? ఎంత ఖర్చుతో సినిమా తీస్తారు అన్నది పరిగణనలోకి తీసుకుని ఏనాడూ థియేటర్లలో టికెట్ల ధరను ఏ రాష్ట్ర ప్రభుత్వమూ నిర్ణయించదు ఆర్జీవీ గారు” అని పేర్కొన్నారు. అలాగే 100 టికెట్‌ను 1000, 2000కు అమ్ముకోవచ్చని ఏ చట్టం చెప్పింది? దీన్ని డిమాండ్‌, సప్లయ్‌ అంటారా? లేక బ్లాక్‌ మార్కెటింగ్‌ అంటారా? అంటూ ఫైర్ అయ్యారు.

దీంతో వ‌ర్మ స్పందిస్తూ.. త‌న‌కు ఎంతో డిగ్నిటీతో సమాధానం చెప్పినందకు సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు వర్మ తన ట్విట్టర్ ఖాతాలో.. థ్యాంక్యూ నాని గారు..చాలా మంది లీడర్ల లా పరుష పదజాలం తో మాట్లాడకుండా డిగ్నిటీ తో సమాధానం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండీ..ఇక విషయానికి వస్తే వంద రూపాయల టికెట్ ని వెయ్యికి అమ్ముకోవచ్చా? అన్నది క్వశ్చన్ కాదండీ ..అది అమ్మేవాడి నమ్మకం..కొనేవాడి అవసరం బట్టి ఉంటుంది అంటూ క్లారిటీ ఇచ్చారు.

నిర్మాతకు, ప్రేక్షకుడికి లేని ఇబ్బంది ప్రభుత్వానికి ఎందుకు? నిర్మాత సినిమా తీస్తున్నాడు. ప్రేక్షకుడు టికెట్ కొని సినిమా చూస్తాడు? మధ్యలో ప్రభుత్వ పెత్తనం ఏంటి ? అని వర్మ ప్రధానంగా ప్రశ్నిస్తున్నాడు. పవన్ కళ్యాణ్ సినిమాకి, సంపూర్ణేష్ బాబు సినిమాకి తేడా లేదని మీ ప్రభుత్వం వారు చెప్పారు. అంటే మంత్రిగా మీకు మీ డ్రైవర్ కు తేడా లేదు అంటారా ? అంటూ తనదైన శైలిలో వర్మ వరుస కౌంటర్లు వేస్తున్నారు.

పేదల కోసం టికెట్ ధరలు తగ్గించాలనే ఆలోచన మంచిది కావచ్చు. పేద ప్రజలని ధనికుల్ని ఎలా చేయాలి అనే అంశంపై మీ ప్రభుత్వం పనిచేయాలి కానీ ఉన్న ధనికుల్ని పేదలని చేయకూడదు. అలా చేస్తే ఆంధ్రప్రదేశ్ ఇండియాలో కల్లా పేద రాష్ట్రం అయ్యే ప్రమాదముంది. నానీ గారు నేను ఒక యావరేజ్ ఇంజినీరింగ్ స్టూడెంట్ ని.. ఎకనామిక్స్ గురించి నాకు ఏ బీ సీ డీ కూడా తెలియదు..కానీ మీరు అనుమతిస్తే మీ ప్రభుత్వం లో ఉన్న టాప్ ఎకనామిక్స్ ఎక్స్పర్ట్ తో నేను టీవీ డిబేట్ కి రెడీ..మా సినిమా ఇండస్ట్రీ కి మీ ప్రభుత్వానికి మధ్య ఏర్పడ్డ ఈ మిసండర్స్టాన్డింగు తొలగిపోవడానికి ఇది చాలా అవసరం అని నా అభిప్రాయం.. థ్యాంక్యూ ..అని వర్మ వరుస ట్వీట్స్ తో విరుచుకు పడ్డారు.

ప్రభుత్వం ఉప్పూ, పప్పు లాంటి నిత్యావసర ధరల్ని నియంత్రిచవచ్చు కానీ సినిమా టికెట్ ధరల్ని ఎలా నియంత్రిస్తుంది అని ప్రశ్నించారు. సినిమా థియేటర్లు కూడా ప్రజలకు సంబందించిన వినోద ప్రాంగణాలు అని పేర్ని నాని అన్నారు .

దీనికి వర్మ బదులిస్తూ. థియేటర్లనేవి , జూన్ 19 1905 న నికెలోడియోన్ అనే ప్రపంచం లోనే మొట్ట మొదటి థియేటర్ అమెరికా లో పెట్టినప్పటి నుంచి ఈనాటి వరకూ అవి కేవలం బిజినెస్ కోసం పెట్టిన వ్యాపార సంస్థలు..అంతే కానీ ప్రజా సేవ నిమిత్తం ఎప్పుడూ ఎవ్వరూ పెట్టలేదు..కావాలంటే మీ గవర్నమెంట్ లో ఉన్న థియేటర్ ఓనర్లని అడగండి అని వ‌ర్మ అన్నారు

థియేటర్‌లో సినిమా టికెట్ల ధరల్ని ప్రేక్షకులకు కల్పించే సౌకర్యాల ఆధారంగా నిర్ణయించాలని మాత్రమే 1970 సినిమాటోగ్రఫీ చట్టం ద్వారా వచ్చిన నిబంధనలు చెపుతున్నాయి అంటూ పేర్ని నాని అన్నారు.

దీనికి వర్మ సమాధానం ఇస్తూ.. 100% కరెక్ట్.అలాంటప్పుడు V EPIC థియేటర్ లో ఉన్న సౌకర్యాలను చూడకుండా ఆ థియేటర్ ఉన్న ఏరియా బట్టి టికెట్ ప్రైజ్ ఎలా పెట్టారు?ఈ కింది ట్వీట్ లో మీరు చెప్పింది మీకు అర్థమైతే ఇంక సమస్య లేనట్టే అని వర్మ అన్నారు. హోటల్స్ విషయానికి వస్తే అందులో ఉన్న సౌకర్యాలని బట్టే ధరలు ఉంటాయి అని వర్మ ప్రస్తావించారు. .
.

Related posts