telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

గల్లా ఫ్యామిలీ ముందు జాగ్రత్త… వారసుడి ఎంట్రీ వాళ్ళలా కాదట…!

mahesh wishes to ashok galla movie launch

ప్రముఖ పారిశ్రామికవేత్త, రాజకీయవేత్త అయిన గల్లా జయదేవ్ తన కుమారుడు గల్లా అశోక్‌ను హీరోగా పరిచయం చేస్తున్న విషయం తెలిసిందే. రెండు రోజుల క్రితం ఈ సినిమా ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ గ్రాండ్ ఈవెంట్‌కు సుమారు రూ.25 లక్షలు ఖర్చుపెట్టినట్టు సమాచారం. యంగ్ స్టార్స్‌తో పాటు సినీ పరిశ్రమ, రాజకీయ రంగానికి చెందిన ప్రముఖలంతా హాజరుకావడంతో ఈ వేడుకతోనే మంచి హైప్ తీసుకొచ్చారు. దీంతో ప్రారంభోత్సవమే ఇంత గ్రాండ్‌గా చేస్తే సినిమా ఇంకెంత గ్రాండియర్‌గా తీస్తారనే చర్చ ఇండస్ట్రీలో మొదలైంది. అయితే తన కుమారుడు అశోక్ లాంచింగ్ విషయంలో గల్లా జయదేవ్ చాలా క్లారిటీగా ఉన్నారట. తాము ప్రారంభించిన ప్రొడక్షన్ హౌస్ నుంచి వస్తోన్న తొలి సినిమా కూడా కావడంతో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలిసింది. భారీగా డబ్బులు కుమ్మరించి చేతులు కాల్చుకోవడానికి అయితే వీరు సిద్ధంగా లేరని సమాచారం. నటీనటులు, సాంకేతిక వర్గం రెమ్యునరేషన్ మినహా సినిమా నిర్మాణానికి రూ.3.5 కోట్ల బడ్జెట్‌ను మాత్రమే గల్లా జయదేవ్ కేటాయించారట. హీరోయిన్ నిధి అగర్వాల్ కోటి రూపాయలు పారితోషికం తీసుకుంటున్నట్టు సమాచారం. ఇక దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య రూ.3 కోట్లు తీసుకుంటున్నారట. మొత్తంగా అన్ని ఖర్చులు కలుపుకుని సినిమా బడ్జెట్ రూ.10 కోట్లని అంటున్నారు. తక్కువ బడ్జెట్‌తో మంచి ఔట్‌పుట్‌ను తీసుకొచ్చి రిస్క్ లేకుండా హిట్టు కొట్టాలని గల్లా ఫ్యామిలీ చిత్ర యూనిట్‌కు సూచించిందని టాక్. తమ ఫ్యామిలీ మెంబర్ అయిన మహేష్ బాబు సూపర్ స్టార్ హోదాలో ఉన్నారు. ఆయన సపోర్ట్ ఎలాగూ అశోక్‌కి ఉంటుంది. కాబట్టి, భారీ బడ్జెట్‌కు పోయి.. ఆ తరవాత విమర్శలు ఎదుర్కొని రచ్చ చేసుకునే బదులు.. తక్కువ బడ్జెట్‌తో ఒక మంచి సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందిస్తే బాగుంటుందని భావిస్తున్నారట. అక్కినేని వారసుడు అఖిల్ తొలి సినిమాను రూ.40 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు. అలాగే, ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ కుమారుడు బెల్లంకొండ శ్రీనివాస్ డెబ్యూ ఫిల్మ్‌ ‘అల్లుడు శీను’ బడ్జెట్ రూ.45 కోట్లు. ఇక, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి కొడుకు నిఖిల్ గౌడ తొలి చిత్రం ‘జాగ్వార్’కు భారీ స్థాయిలో రూ.60 కోట్లు ఖర్చుపెట్టారు. వీళ్లంతా భారీగా డబ్బులు కుమ్మరించి చేతులు కాల్చుకున్నారు. కానీ, తమ వారసులను ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లగలిగారు.

Related posts