telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

రేపే దేశవ్యాప్తంగా రహదారుల దిగ్బంధం..

కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలకు రైతులు ఢిల్లీలో ఉద్యమం చేస్తున్న విషయం తెలిసిందే.  రైతులు మాత్రం వ్యవసాయ చట్టాల రద్దుకే డిమాండ్‌ చేస్తున్నారు.  అయితే… తాజాగా రేపు ( ఫిబ్రవరి 6తేదీన) దేశవ్యాప్తంగా రైతులు “చక్కా జామ్”(రహదారుల దిగ్బంధం) కార్యక్రమం నిర్వహించనున్నారు. కేంద్ర బ‌డ్జెట్‌లో వ్య‌వ‌సాయ రంగానికి కేటాయింపులు త‌గ్గించార‌ని రైతు సంఘాలు విమ‌ర్శలు చేశాయి. శనివారం మధ్యాహ్నం 12 గంటల నుండి 3 గంటల వరకు దేశ వ్యాప్తంగా జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులను దిగ్బంధనం చేయనున్నాయి రైతు సంఘాలు. రైతుల ట్రాక్టర్ ల ర్యాలీ సందర్భంగా గత నెల 26న దేశ రాజధానిలో హింస చెలరేగిన నేపధ్యంలో ఢిల్లీ పోలీసులు భారీ ఏర్పాట్లు చేశారు. సరిహద్దుల నుంచి రైతులు దేశ రాజధానిలోకి ప్రవేశించకుండా భారీ భద్రతా ఏర్పాట్లు చేసింది కేంద్ర ప్రభుత్వం. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో జరుగుతున్న ఆందోళనలను కట్టడి చేసేందుకు అధికార యంత్రాంగం పక్కా ఏర్పాట్లు చేసింది. అటు కనీస మద్ధతు ధరపై పార్లమెంట్ లో నేడు కేంద్రం ప్రకటన చేసే అవకాశం అంటూ జాతీయ మీడియాలో ప్రచారం జరుగుతోంది. రైతుల “చక్కా జామ్” నేపధ్యంలో నిన్న ప్రధానితో కేంద్ర మంత్రుల భేటీ జరిగింది. ఢిల్లీ పోలీసు కమిషనర్, ఇంటలిజెన్స్ ఛీఫ్ తో సమావేశమై ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా. నిన్న సాయంత్రం కూడా పార్లమెంట్ లో అమిత్ షా నేతృత్వంలో అత్యంత ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం జరిగింది. 

Related posts