అంబరీష్ సతీమణి, బహుబాష నటి సుమలత మండ్య లోక్ సభ ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి బుధవారం (మార్చి 20వ తేది) నామినేష్ వేశారు. మండ్యలోని జిల్లాధి కార్యాలయంలో సుమలత స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా నామినేష్ వేశారు. సుమలత నామినేష్ వేస్తున్న సందర్బంగా మండ్య జిల్లాధికారి కార్యాలయం ముందు వేల సంఖ్యలో అంబరీష్ అభిమానులు గుమికూడారు. నామిషన్ వేసిన సుమలతకు అహిందా నాయకులు మద్దతు తెలిపారు. సుమలత నామినేష్ వేస్తున్న సందర్బంగా అభిమానులు అంబరీష్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు.
సుమలత నామినేషన్ వెయ్యక ముందు మైసూరు సమీపంలోని శ్రీ చాముండేశ్వేరి దేవిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం శ్రీ చాముండేశ్వరి ఆలయం నుంచి నేరుగా మండ్య తాలుకాలోని ఇండువాళిలోని కాంగ్రెస్ పార్టీ నాయకుడు సచ్చిదానంద ఇంటికి చేరుకుని ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం మండ్య జిల్లాధికారి కార్యాలయం చేరుకున్న సుమలత మూడు సెట్ల నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఆమె సమర్పించిన నామినేషన్ పత్రాలలో 10 మంది అహిందా నాయకులు సంతకాలు చేశారు. సుమలత వెంట హీరో యష్, ఆమె కుమారుడు అభిషేక్, ప్రముఖ నిర్మాత, నటుడు రాక్ లైన్ వెంకటేష్, నటుడు దోడ్డన్న, అంబరీష్ సోదరుడు మదుసూధన్, ప్రముఖ కన్నడ దర్శకుడు నాగశేఖర్ తో పాటు అనేక మంది సుమలత వెంట ఉన్నారు. నామినేషన్ వేసిన తరువాత మండ్యలోని జుబ్లీ పార్క్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో అంబరీష్ అభిమానులను ఉద్దేశించి సుమలత ప్రసంగించారు.
కేసీఆర్ ఓ తుగ్లక్ ముఖ్యమంత్రిగా వ్యవహిరిస్తున్నారు: మాజీ ఎంపీ వివేక్