ఇప్పటికే కాజల్ అగర్వాల్, తమన్నా, త్రిష, అమలాపాల్ వెబ్ సిరీస్ లు చేయబోతున్నారు. ఇప్పుడు వీరి బాటలోనే వరలక్ష్మీ శరత్‌కుమార్, ఐశ్వర్య రాజేష్ కూడా నడవబోతున్నారు. వీరిద్దరూ కలిసి తమిళంలోని ఓ వెబ్ సిరీస్ లో నటించడానికి రంగం సిద్దం చేసుకున్నారు. ఇది ఇద్దరి సవతుల మధ్య జరిగే ఎమోషనల్ సిరీస్ అని, ఎక్కువ నిడివి ఉన్న ఇలాంటి వెబ్ సిరీస్ లో నటిస్తే తమ ప్రతిభను కనబర్చడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుందనే ఉద్దేశ్యంతో వరలక్ష్మీ శరత్‌కుమార్, ఐశ్వర్య రాజేష్ ఈ వెబ్ సిరీస్ లో నటించబోతున్నారట. అన్నట్టు ఈ వెబ్ సిరీస్ ను దర్శకుడు సూర్య సుబ్రమణ్యన్ డైరెక్ట్ చేయనుండగా, అనంద్ వికటన్ సంస్థ నిర్మిస్తోంది. డిజిటల్ స్ట్రీమింగ్స్ రోజురోజుకూ జనంలోకి బాగా వెళ్తుండటంతో ఇప్పటికే బడా నిర్మాతలు సైతం వెబ్ సిరీస్ లను నిర్మించే ప్లాన్ లో ఉన్నారు.
previous post