telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“ఆకాశమే హద్దురా” మళ్ళీ వాయిదా ?

surya movie aaksame haddura first look

సూర్య హీరోగా నటిస్తూ నిర్మిస్తోన్న చిత్రం ‘శూర‌రై పోట్రు’. ఈ చిత్రాన్ని ‘ఆకాశం నీ హ‌ద్దురా’ పేరుతో తెలుగులో విడుద‌ల చేస్తున్నారు. ‘గురు’ ఫేమ్ సుధా కొంగ‌ర ద‌ర్శ‌క‌త్వంలో సినిమా తెర‌కెక్కుతోంది. నిర్మాణానంత‌ర కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటోన్న ఈ సినిమాను ముందుగా ఫిబ్ర‌వ‌రిలోనే రిలీజ్ చేద్దామ‌ని అనుకున్నారు. త‌ర్వాత సినిమా విడుద‌ల ఏప్రిల్‌కు వాయిదా ప‌డింది. అయితే లేటెస్ట్ స‌మాచారం మేర‌కు ఈ సినిమాను మ‌ళ్లీ మే 1న విడుద‌ల చేయాల‌ని నిర్మాత‌లు భావిస్తున్నార‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. విల‌క్ష‌ణ న‌టుడు మంచు మోహ‌న్‌బాబు ఈ చిత్రంలో ఓ కీల‌క పాత్ర‌లో న‌టించారు. ఎయిర్ డెక్క‌న్ వ్య‌వ‌స్థాప‌కుడు జి.ఆర్‌.గోపీనాథ్ జీవితాన్ని ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు.

Related posts