కొన్ని యూట్యూబ్ ఛానల్స్‌లో తనను కించపరుస్తూ కొరియోగ్రాఫర్ రాకేష మాస్టర్ ఇచ్చిన ఇంటర్వ్యూలు ప్రసారం చేస్తుండటంతో ఆ ఛానల్స్‌కి లీగల్ నోటీసులు ఇస్తానని వార్నింగ్ ఇస్తోంది శ్రీరెడ్డి. రాకేష్ మాస్టర్ తన గురించి మాట్లాడిన ఇంటర్వ్యూలను తొలగించకపోతే వాళ్లకు లీగల్ నోటీసులు అందిస్తానని హెచ్చరిస్తూ ఫేస్ బుక్‌లో పోస్ట్ పెట్టింది శ్రీరెడ్డి. టాలీవుడ్ క్యాస్టింగ్ కౌచ్ ఉదంతంలో తనకు జరిగిన అన్యాయంపై గట్టిగానే పోరాటం చేసింది శ్రీరెడ్డి. అర్థనగ్న ప్రదర్శనతో నేషనల్ మీడియాను సైతం తన వైపు తిప్పుకుంది. ఆ తరువాత జరిగిన పరిణామాలతో చాలా మీడియా సంస్థలు ఆమెను పట్టించుకోవడం మానేయడంతో సోషల్ మీడియాతో పాటు కొన్ని యూట్యూబ్ ఛానల్స్‌ని ఆయుధంగా చేసుకుని తన పోరాటాన్ని కొనసాగించింది.
previous post
అభాండాలు వేసి, బూతులు తిట్టారు : శేఖర్ మాస్టర్