telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

‘అదితి పలావ్’… నెటిజన్ క్రిటివిటికి హీరోయిన్ ఫిదా

Aditi-rao

డైరెక్టర్ మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కిన “సమ్మోహనం” చిత్రంలో సుధీర్ బాబు సరసన హీరోయిన్ గా నటించింది అదితిరావు హైదరి. ఈ చిత్రంతోనే టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ. అనతి కాలంలోనే తెలుగు ప్రేక్షకులకు దగ్గరైపోయింది. ప్రస్తుతం ఈ బ్యూటీ వెబ్ సిరీస్ లతో ఫుల్ బిజీగా ఉంది. తాజాగా హీరోయిన్ అదితిరావు హైదరి దృష్టిని ఆకర్షించేందుకు ఆమె అభిమాని గుహన్ విభిన్నంగా ఫొటో ఎడిట్ చేసి ట్వీట్ చేశాడు.ఓ ప్లేటులో పలావ్ వుండగా.. దాని మధ్యలో అదితిరావు ఫొటో వచ్చేలా సరదాగా ఎడిట్ చేసాడు. ఈ ఫొటోను క్రియేట్‌ చేస్తూ దానికి ‘అదితి పలావ్’ అంటూ ఆ అభిమాని పేరు పెట్టాడు. దాన్ని చూసిన అదితి బాబోయ్ చంపేశారు అంటూ చాలా స్మైలింగ్ ఈమోజీలను పోస్ట్ చేసింది. తన ఫొటోకు అదితి స్పందించడం పట్ల ఆ అభిమాని సంతోషానికి అవధుల్లేవు.

Related posts