ఈరోజు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ పితామహుడు, భౌతికశాస్త్రవేత్త, పారిశ్రామికవేత్త, ఆవిష్కర్త విక్రమ్ సారాభాయ్ 100వ జయంతి. ఈ సందర్భంగా విక్రమ్ సారాభాయ్ గౌరవార్ధం గూగుల్ ప్రత్యేక డూడుల్‌ను రూపొందించి ఘన నివాళి అర్పించింది. విక్రమ్ సారాభాయ్ ఇస్రోను స్థాపించిన విషయం తెలిసిందే. 12 ఆగస్టు,1919లో అహ్మదాబాద్‌లో జన్మించిన ఆయన కేంబ్రిడ్జి యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ అందుకుని భారత్‌కు తిరిగి వచ్చారు. 28 ఏళ్ల వయస్సులో అహ్మదాబాద్‌లో ఫిజికల్ రీసెర్చ్ లాబోరేటరీ (పీఆర్‌ఎల్)ను స్ధాపించారు. రష్యా స్ఫూత్నిక్ లాంచ్ తర్వాత అంతరిక్ష పరిశోధనల ప్రాముఖ్యత గురించి, మనిషి, సమాజం ఎదుర్కొనే సమస్యలకు నిజమైన పరిష్కార మార్గాలకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడంపై విక్రమ్ సారాభాయ్ భారత ప్రభుత్వానికి వివరించారు. భారత అణు పితామహుడు డాక్టర్ హోమీ బాబా సంపూర్ణ మద్దతుతో భారత్‌లో మొదటి రాకెట్ లాంచింగ్ స్టేషన్‌ను విక్రమ్ సారాభాయ్ స్థాపించారు. 21నవంబర్, 1963న సోడియం వేపర్ పేలోడ్‌ను ప్రారంభ ప్రయోగంగా చేపట్టారు. విక్రమ్ సారాభాయ్ 30 డిసెంబర్,1971న తిరువనంతపురంలో తుదిశ్వాస విడిచారు. ఇస్రో ఇటీవల చేపట్టిన చంద్రయాన్-2 ప్రయోగంలో విక్రమ్ ల్యాండర్ సెప్టెంబర్ 7న చంద్రుని ఉపరితలాన్ని తాకనుంది.
previous post
next post