చెలీ! నీ సిగలో
మల్లె మాలనై ఒదిగిపోనా!
హరివిల్లు నీమెడలో
కంఠహారాలై మారిపోనా!
నీ చెవులకు కమ్మలనై
నెమలిలా నాట్యమాడనా!
పూవులాంటి నీతనువుపై
ప్రేమ తుమ్మెదనై వాలిపోనా!
వెచ్చనిమెత్తని నీ వలపుల
ఒడిలో ప్రేమ రాజునై సేదదీరనా!
వెన్నెల వన్నెల పరువాల
పాన్పుపై పవళించనా!
నీ గుండె గర్భగుడిలో
ప్రేమ దివ్వెనై వెలిగిపోనా!
నీ కనుల కొలనులో
కనుపాపనై ఉండిపోనా!
గుండె గుప్పిట్లో శ్వాసనై
నిలవునా! నా ప్రాణేశ్వరీ!!
నీడలా నిన్నంటి నడవనా!!
జాడనై నీ పాదాలు తాకనా!
చెప్పవా చెలికానికి చెలీ!
మనసు విప్పవా సఖీ!
-గద్వాలసోమన్న, ఎమ్మిగనూరు