telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

రాజమౌళి ఆఫర్ ను తిరస్కరించిన హీరోయిన్… ఇప్పుడు బాధ పడితే ఏంటి లాభం..!

Archana

బిగ్ బాస్ ఫేస్, నటి అర్చన శాస్త్రి చేజేతులారా రాజమౌళి ఆఫర్ ను తిరస్కరించి ఇప్పుడు బాధ పడుతోంది. ఈ విషయంపై ఆమె స్పందిస్తూ “నేను అప్పుడు హీరోయిన్‌గా చేస్తున్నాను. అదే సందర్భంలో మగధీర చిత్రంలో సలోని పాత్రకోసం రాజమౌళి గారు నన్ను అడిగారు. కాని నేను ఆ టైంలో రాజమౌళి ఆఫర్‌ను రిజెక్ట్ చేశా. ఆ టైంలో నా జర్నీ చాలా బాగా సాగుతోంది. నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమా హిట్ అయ్యింది.. ఆ సినిమాలో నేను కీ రోల్ చేశా. త్రిష, సిద్దార్థ్‌లతో పాటు సక్సెస్ మీట్‌లలో నా గురించి కూడా మాట్లాడుకునే వాళ్లు. కాని ఒక సినిమాను నా షోల్డర్ మీద క్యారీ చేసే సత్తా నాలో ఉంది. నేను చేయగలననే నమ్మకం నాకు ఉంది. పైగా వేద అనే రోల్ జనాల్లోనే కాకుండా ఇండస్ట్రీలోనూ బాగా వెళ్లింది. కాని నేను హీరోయిన్‌గా రాణించాలి అనుకున్నప్పుడు మిస్టేక్ చేశానని అనను కాని.. అదే టైంలో రాజమౌళి గారు నాకు మర్యాదరామన్న చిత్రంలో సలోని పాత్రకు నన్ను అడిగారు. కాని నేను ఎక్కువ ఆలోచించి రిజెక్ట్ చేశా. నా కెరియర్ మీద భయమో ఏమో తెలియదు కాని ఆ పాత్రను వదిలేశా. కాని ఇప్పుడు అనిపిస్తుంది.. రాజమౌళి డైరెక్షన్‌లో సినిమా అంటే బిగ్ డీల్ కాబట్టి ఎక్కువ ఆలోచించకుండా చేయాల్సిందని. కాని ఇప్పుడు జరగాల్సింది జరిగిపోయింది. ఆ తరువాత నేను లీడ్ చేసిన ఫ్లాప్ అయ్యాయి.. సైడ్ రోల్స్ చేస్తే హిట్ అయ్యాయి. నా ప్లేస్‌లో వేరే హీరోయిన్‌ని తీసుకున్నారు పెద్ద హిట్ అయ్యింది. ఆ సినిమా ఏంటి ? దర్శకుడు ఎవరు అన్నది చెప్పడం నాకు ఇష్టం లేదు. దాని వల్ల ఇప్పుడు చెప్పినా ఉపయోగం ఉండదు. రాజమౌళి అడిగినప్పుడు చేయకపోవడం అనేది నా మిస్టేక్. కాని నేను రిజెక్ట్ చేయడం వల్ల ఈ అమ్మాయికి పొగరేమో అనుకుంటారేమో కాని నా ఉద్దేశం అది కాదు. అంత పెద్ద దర్శకుడ్ని ఎందుకు వదిలేశానా? అని అనిపిస్తుంది. రాజమౌళి సార్‌తో నేను యమదొంగ టైంలో పనిచేశా. ఒక సాంగ్‌లో యాక్ట్ చేశా. ఆయన చాలా గ్రేట్ డైరెక్టర్.. ఆయనతో నేను మాట్లాడి.. ఓపెన్ అయ్యి జరిగింది చెప్పాలని అనుకున్నాను. క్షమించమని అడుగుదాం అనుకున్నా. మగధీర తరువాత చాలాసార్లు రాజమౌళి సార్‌ని చాలాసార్లు కలిశాను. మాట్లాడాను.. కాని ఏదో మిస్ చేసుకున్నా అనే ఫీలింగ్ అలానే ఉండిపోయింది.” అంటూ తన బాధను వెళ్లగక్కింది అర్చన.

Related posts