telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

హేమమాలిని 14 ఏళ్ళ ఫోటో… ఎట్టకేలకు దొరికేసింది…!

hemamalini

అల‌నాటి అందాల న‌టి హేమ‌మాలిని ఓ త‌మిళ మ్యాగ‌జైన్ కోసం నిర్వ‌హించిన ఫొటోషూట్ లో హేమ‌మాలిని దేవ‌త గెట‌ప్ వేశారు. అయితే ఆ ఫొటో ఎక్క‌డో మిస్స‌యింది. త‌న సినీ కెరీర్ మొద‌ల‌వ‌క ‌ముందు క‌నిపించ‌కుండా పోయిన‌ ఫొటో కోసం చాలా ఏండ్లుగా వెతుకుతున్న హేమ‌మాలినికి ఎట్ట‌కేల‌కు ఫొటో దొరికింద‌ట‌. ఈ విష‌యాన్ని ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా తెలిపింది. 2017లో పబ్లిష్ అయిన త‌న జీవిత చ‌రిత్ర బియాండ్ ది డ్రీమ్ గ‌ర్ల్ లో ఈ ఫొటో వాడాల‌నుకున్న హేమ‌మాలికి అప్ప‌ట్లో ఈ ఫొటో దొర‌క‌లేద‌ట‌. 14 ఏళ్ల వయసులో దిగిన ఈ ఫొటోను షేర్ చేస్తూ.. “ఈ ఫొటో కోసం నేను చాలా సంవ‌త్స‌రాలుగా వెతుకుతున్నా. ఓ త‌మిళ మ్యాగ‌జైన్ కోసం ప్ర‌త్యేకంగా ఈ ఫొటోషూట్ నిర్వ‌హించారు. మ్యాగ‌జైన్ పేరు గుర్తు లేదు కానీ ఫొటోషూట్ ను ఏవీఎం స్టూడియోలో చేశారు. నేన‌ప్పుడు 14-15 ఏళ్ల వయసులో ఉన్నాను. రాంక‌మ‌ల్ ముఖ‌ర్జీ నా బ‌యోగ్ర‌ఫీ బియాండ్ ది డ్రీమ్ గర్ల్ లో ఈ ఫొటో యాడ్ చేద్దామ‌నుకున్నా..దుర‌దృష్ణ‌వ‌శాత్తు ఫొటో అప్పుడు దొర‌క‌లేదు. మొత్తానికి ఫొటో దొర‌క‌డం సంతోసంగా ఉంది” అంటూ పోస్ట్ చేశారు హేమమాలిని. కాగా హేమ‌మాలిని బాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చేముందు క‌ల్చ‌ర‌ల్ ఈవెంట్స్ లో పాల్గొనేవారు.

Related posts