విభిన్నమైన చిత్రాల్లో విలక్షణమైన పాత్రల్లో కనిపించడానికే విక్రమ్ ప్రాధాన్యతనిస్తారు. ఆయన తాజా చిత్రం “కడరమ్ కొండన్”లోను ఆయన కొత్త లుక్ తో కనిపించనున్నారు. ఈ సినిమాలో ఆయన లుక్ హైలైట్ అని అంటున్నారు. కమల్ హాసన్ సొంత బ్యానర్లో నిర్మితమవుతోన్న ఈ సినిమాకు రాజేశ్ ఎం.సెల్వ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ రోజు విక్రమ్ పుట్టినరోజు… 53వ వసంతంలోకి ఆయన అడుగు పెట్టిన సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన స్పెషల్ మేకింగ్ వీడియోను విడుదల చేశారు చిత్రబృందం. విక్రమ్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ దర్శకుడు రాజేశ్ ఎం.సెల్వ ఈ మేకింగ్ వీడియోను ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు. ఈ మేకింగ్ వీడియో విక్రమ్ అభిమానులను ఫిదా చేస్తోంది. ఈ సినిమాలో పూజా కుమార్, అక్షర హాసన్ కీలకమైన పాత్రల్లో నటిస్తున్నారు. తమిళ, తెలుగు భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు.
Happiest birthday to our own #ChiyaanVikram! ❤️ The energy u bring in to the crew & the positivity u transform to the project is amazing!Looking forward for more such collaborations in future.. 😉👍🏼Wishing u a very successful and promising years ahead my dear KK! ❤️#KadaramKondan pic.twitter.com/y6KG1pokhM
— RMS (@RajeshMSelva) April 16, 2019