telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సెట్లో సోనూసూద్ ను గౌరవించిన “అల్లుడు అదుర్స్” టీం

Sonusood

బెల్లంకొండ ఇప్పుడు తన ఎనిమిదో సినిమాగా ‘అల్లుడు అదుర్స్ చిత్రంలో నటిస్తున్నాడు’. కందిరీగ ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమా కోసం శ్రీనివాస్ తన బాడీని పూర్తిగా మార్చేశారు. 2021 సంక్రాంతి ఫెస్టివల్ సీజన్ కి ఈ సినిమాని విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాలో బెల్లాకొండ శ్రీనివాస్ సరసన నభా నటేష్, అనూ ఇమాన్యుల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ప్రకాష్ రాజ్, సోనూసూద్, వెన్నెల కిషోర్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.సుమంత్ మూవీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై గొర్రెల సుబ్రహ్మణ్యం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ కరోనా కారణంగా వాయిదా పడింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు షూటింగ్ లకి పర్మిషన్ లు ఇవ్వడంతో మళ్ళీ టాలీవుడ్ లో షూటింగ్ ల సందడి మొదలైంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో తిరిగి ప్రారంభమైంది. ఈ సినిమా షూటింగ్ లో బాలీవుడ్ నటుడు సోనూసూద్ ఈ రోజు పాల్గొన్నారు. సెట్లోకి సోనూ ఎంటర్ అవ్వగానే చిత్ర యూనిట్ మొత్తం సోనూకి చప్పట్లతో స్వాగతం పలికారు. అనంతరం నటుడు ప్రకాష్ రాజ్ సోనూసూద్ కి శాలువు కప్పి సత్కరించారు. అనంతరం ఓ జ్ఞాపికను కూడా బహూకరించి అభినందిచారు. దీనితో సెట్లో మొత్తం సందడి మొదలైంది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Related posts