telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“బిగ్ బాస్ సీజన్ 4″కు కరోనా ?

Bigg-Boss-4

బిగ్ బాస్ సీజన్ 4 ప్రారంభం కావడానికి దాదాపు ముహూర్తం ఖాయం అయినట్టే. ఇప్పటికే సీజన్ 4లో పాల్గొనబోయే కంటెస్టెంట్స్ లిస్ట్ ఫైనల్ కాగా… 106 రోజుల పాటు బిగ్ బాస్ షో నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మూడో సీజన్‌కు హోస్ట్‌గా వ్యవహరించిన కింగ్ నాగార్జునే నాలుగో సీజన్‌కి హోస్టింగ్ చేస్తున్నారు. ఇప్పటికే నాగార్జున ప్రోమోతో ఆదరగొట్టేశారు. అయితే బిగ్ బాస్ షో సీజన్-4 పోటీదారుల జాబితా గురించి చాలా పుకార్లు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సీజన్‌లో జబర్దస్త్‌ కెవ్వు కార్తీక్‌, సింగర్ నోయల్‌ సేన్‌, యాంకర్లు లాస్య, అరియానా, నటులు కరాటే కళ్యాణి, సురేఖా వాణి, పూనమ్ బజ్వా, పూజిత పొన్నాడ, నందు యూట్యూబర్లు అలేఖ్య హారిక, మహబూబ్ దిల్‌ సే, గంగవ్వ, కొరియోగ్రాఫర్ రఘు మాస్టర్‌ ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే నందు ఇప్పటికే తాను షో లో ఉండబోతున్నానంటూ స్పష్టం చేసారు. ఇదిలా ఉండగా కరోనా వ్యాప్తి నేపథ్యంలో నిర్వాహకులు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కంటెస్టెంట్ లకు ముందుగా కరోనా టెస్టులు చేసి వారిని ఒక హోటల్ లో ఉంచినట్టు సమాచారం. అయితే మరోసారి కంటెస్టెంట్ లకు కరోనా టెస్ట్ చేయగా ఓ కంటెస్టెంట్ కు పాజిటివ్ వచ్చినట్టు తెలుస్తోంది. కంటెస్టెంట్ కు కరోనా రావడంతో నిర్వాహకులు టెన్షన్ లో ఉన్నారట.

Related posts