మెగాస్టార్ చిరంజీవితో కొరటాల ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న విషయం తెలిసిందే. దర్శకత్వ బాధ్యతలే కాకుండా మరో బాధ్యతను కొరటాలనే తీసుకున్నారట. ఈ సినిమాకు సంబంధించిన బిజినెస్‌ను మొత్తం ఇప్పుడు కొరటాలనే చూసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో కొరటాలకు రామ్ చరణ్ పూర్తి అధికారాలు ఇవ్వడంతో.. డిస్ట్రిబ్యూషన్ హక్కులు, శాటిలైట్ హక్కులు, థియేట్రికల్ హక్కులు ఇలా ప్రతీది తానే చూసుకుంటున్నారట కొరటాల. అంతేకాదు ఇప్పటి నుంచే ప్రీ రిలీజ్ బిజినెస్‌ను ప్రారంభించిన కొరటాల.. తనకు సన్నిహితంగా ఉన్న వారికి డిస్ట్రిబ్యూషన్ హక్కులను ఇస్తున్నారట. అయితే ఈ మూవీ నైజాం, గుంటూరు హక్కులను తీసుకోవాలని నిర్మాత దిల్ రాజు చాలా ప్రయత్నించారట. కానీ కొరటాల మాత్రం ఆయనను పక్కనపెట్టారట. ఈ క్రమంలో నైజాం రైట్స్ లక్ష్మణ్ కు, ఉత్తరాంధ్ర హక్కులను సుధాకర్ అనే తన సన్నిహితుడికి ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో దిల్ రాజు కాస్త చిన్నబుచ్చుకున్నారని సమాచారం.