telugu navyamedia
సినిమా వార్తలు

అమలాపాల్ “ఆమె” వాయిదా

amala paul on her movie aadai shoot

రత్నకుమార్ దర్శకత్వంలో అమలాపాల్ హీరోయిన్ గా రూపొందుతున్న చిత్రం “ఆమె”. తమిళంలో “ఆడై” టైటిల్ తో చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఈ సినిమాను వీ స్టూడియోస్ సంస్థ నిర్మిస్తుండగా చరిత చిత్ర, తమ్మారెడ్డి భరద్వాజలు సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా టీజర్లో నగ్నంగా కన్పించి అందరికీ షాకిచ్చింది అమలాపాల్. ఇక టీజర్ విషయానికొస్తే ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతూ వీక్షకుల్ని ఆకట్టుకుంది. ప్రముఖులు సైతం సినిమా టీజర్ పై ప్రశంసలు కురిపించారు. టీజర్ విడుదలైన కొన్ని గంటల్లోనే మిలియన్ల వ్యూస్ రాబట్టింది. ఇటీవలే ఈ సినిమా తెలుగు ట్రైల‌ర్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. ఇందులో అమలాపాల్ మందు తాగుతూ, సిగరెట్ కాలుస్తూ లిప్ లాక్ చేస్తూ చాలా బోల్డ్ గా కనిపించింది. తెలుగు, త‌మిళంలో ఈ సినిమాను జూలై 19న సినిమాను విడుద‌ల చేయాలని నిర్ణయించుకున్నారు. కాని కొన్ని ఫైనాన్షియ‌ల్ స‌మ‌స్య వ‌ల‌న ఈ చిత్రం నేడు విడుద‌ల కాలేదు. త్వ‌ర‌లో కొత్త రిలీజ్ డేట్ ప్ర‌క‌టించ‌నున్నారు. అభిమానులు ఈ సినిమా కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూడ‌గా, వారికి నిరాశే ఎదురైంది.

Related posts