telugu navyamedia
వార్తలు సామాజిక

అమ్మ పాలు అమృతం.. జింక పిల్లకు పాలిచ్చిన మహిళ!

women deer

అమ్మ పాలు బిడ్డకు అమృతం లాంటివి. తల్లి పాలే బిడ్డకు శ్రీరామ రక్ష, బిడ్డ ఎదుగుదలకు తల్లి పాలే బలమైన ఆహారం. ఆకలితో కేకలు పెట్టే ఓ బిడ్డకు తల్లి పాలిచ్చి తన మాతృత్వాన్ని పంచుతుంది. ఆ మాతృత్వపు స్పర్శతో ఆ బిడ్డ హాయిగా నిద్ర పోతోంది. మరి అలాంటి అమ్మ.. ఆకలితో అలమటిస్తున్న ఓ జింక పిల్లకు పాలిచ్చి.. మాతృమూర్తి గొప్ప తనాన్ని చాటి చెప్పింది. ఈ అద్భుతమైన దృశ్యాన్ని ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి ప్రవీణ్ కశ్వాన్ తన ట్విట్టర్ పేజీలో షేర్ చేశారు.

రాజస్థాన్ జోధ్‌పూర్‌లోని బిష్ణోయ్ కమ్యూనిటీకి చెందిన ఓ మహిళ.. జింక పిల్లకు పాలిచ్చిన దృశ్యాన్ని షేర్ చేసిన ప్రవీణ్ కశ్వాన్.. బిష్ణోయ్ కమ్యూనిటీ మహిళలు జంతువుల పట్ల ఎంత జాగ్రత్త తీసుకుంటున్నారో ఈ చిత్రాన్ని చూస్తే అర్థమవుతుందన్నారు. ఈ జంతువులు వారి పిల్లల కంటే తక్కువ కాదు అని ఆయన పేర్కొన్నారు. ఇక ఈ మహిళపై సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Related posts