నీ మౌనంలో
ఎన్నెన్నో భావాలు
నీ చూపులో
ఎన్నెన్నో కావ్యాలు
నీ పలుకులో
ఎన్నెన్నో వర్ణాలు
నీ నడకలో
ఎన్నెన్నో శిల్పాలు
నీ స్వరంలో
ఎన్నెన్నో రాగాలు
నీ వైపుకు నా హృదయాన్ని
ప్రేమ బందీని చేసాయ్ ప్రియా !
-కయ్యూరు బాలసుబ్రమణ్యం,
శ్రీకాళహస్తి