telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఉగాది పండుగ కానుక ఇచ్చిన రెబల్ స్టార్ ప్రభాస్…

రెబల్ స్టార్ ప్రభాస్ వరుస సనిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ ఆదిపురుష్, సలార్ సినిమా షూటింగ్‌లలో పాల్గొననున్నాడు. బాహుబలి తరువాత జాతీయ స్థాయి హీరోగా ప్రభాస్ గొప్ప స్థాయిలో ఉన్నాడు. వెంటనే సాహో అంటూ యాక్షన్ హీరోగా కూడా నిరూపించుకున్నాడు. అయితే ఇటీవల ప్రభాస్ చేసిన తాజా చిత్రం రాధేశ్యామ్. ఇందులో బుట్టబొమ్మ పూజ హెగ్దె హీరోయిన్‌గా నటించింది. తాజాగా ఈ చిత్రం నుంచి ఉగాది స్పెషల్ గా ప్రభాస్ కు సంబంధించిన పోస్టర్ ను విడుదల చేశారు. ఇందులో ప్రభాస్ స్టైలిష్ అవుట్ ఫిట్ లో నవ్వుతూ హ్యాండ్సమ్ గా కన్పిస్తున్నారు. అయితే ‘రాధేశ్యామ్’ అప్డేట్ కోసం ప్రభాస్ అభిమానులు కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా చిన్న గ్లిమ్స్ వదిలిన మేకర్స్ మళ్ళీ ఇప్పటికి వరకు ఒక్క అప్డేట్ కూడా ఇవ్వలేదు. దీంతో ఇటీవలే ప్రభాస్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా ‘నిద్రలే’ యూవీ క్రియేషన్స్ అనే హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఉగాది సందర్భంగా ‘రాధేశ్యామ్’ టీం ప్రభాస్ పోస్టర్ ను విడుదల చేయడం ఆయన అభిమానులు సంతోషించే విషయమే.

Related posts