telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

కన్నడ స్టార్ హీరో టాలీవుడ్ ఎంట్రీ… పాన్ ఇండియా మూవీతో…!

Dhruv-Sarja

యాక్షన్ కింగ్ అర్జున్ మేన‌ల్లుడు, క‌న్నడ చిత్రసీమ‌లోని స్టార్ యాక్టర్లలో ఒక‌రైన ధృవ స‌ర్జా హీరోగా న‌టిస్తోన్న తాజా చిత్రం ‘పొగ‌రు’. హ్యాట్రిక్ యాక్షన్ ప్రిన్స్‌గా పేరు పొందిన ధృవ స‌ర‌స‌న ర‌ష్మికా మంద‌న హీరోయిన్ గా నటిస్తోంది. పాన్ ఇండియా ఫిల్మ్‌గా రూపొందుతోన్న ‘పొగ‌రు’కు నంద‌కిశోర్ ద‌ర్శకత్వం వ‌హిస్తున్నారు. ‘విక్టరీ’, ‘అధ్యక్షా’, ‘ర‌న్న’, ‘ముకుంద మురారి’ వంటి హిట్ సినిమాలతో డైరెక్టర్‌గా నంద‌కిశోర్ మంచి పేరు సంపాదించారు. డిస్ట్రిబ్యూట‌ర్‌గా 100కు పైగా చిత్రాల‌ను పంపిణీ చేసి, ‘అధ్యక్షా’ వంటి హిట్ మూవీని నిర్మించిన బి.కె. గంగాధ‌ర్ ‘పొగ‌రు’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆగ‌స్ట్ 6న ఈ సినిమాలోని మొద‌టి పాట ‘క‌రాబు’ విడుద‌ల‌తో తెలుగు వెర్షన్ ప్రమోష‌న్స్‌ను ప్రారంభించేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలోని పాట‌ల‌కు పాపుల‌ర్ క‌న్నడ మ్యూజిక్ డైరెక్టర్ చంద‌న్ శెట్టి బాణీలు అందిస్తున్నారు. సినిమాటోగ్రాఫ‌ర్‌గా ఎస్‌.డి. విజ‌య్ మిల్టన్‌, ఎడిట‌ర్‌గా కె.ఎం. ప్రకాష్ ప‌నిచేస్తున్నారు. సంప‌త్ రాజ్‌, ధ‌నంజ‌య్‌, ర‌విశంక‌ర్‌, ప‌విత్రా లోకేష్‌, గిరిజా లోకేష్ వంటి పేరుపొందిన న‌టులు న‌టిస్తోన్న ఈ చిత్రంలో ‘డ‌బ్ల్యుడ‌బ్ల్యుఈ’ స్టార్లు కై గ్రీన్‌, మోర్గాన్ ఆస్టే, జో లిండ్నర్‌, జాన్ లూకాస్ కూడా న‌టిస్తుండ‌టం విశేషం. చిక్కన్న, రాఘ‌వేంద్ర రాజ్‌కుమార్‌, క‌రి సుబ్బు, ధ‌ర్మా, మ‌యూరి, త‌బ‌లా నాని ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.

Related posts