telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

వారి బయోపిక్స్ లో నటిస్తా : రష్మిక

Rashmika

మన టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగుతుంది కన్నడ బ్యూటీ రష్మిక. అయితే ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో బయోపిక్ ల ట్రెండ్ నడుస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. రాజకీయం, స్పోర్ట్స్, సినిమా ఇలా అన్నిరంగాల్లోని ప్రముఖుల వ్యక్తుల జీవితాలను సినిమాగా తెరకెక్కిస్తున్నారు. కాగా, ఇటీవల రష్మిక మందనకు ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చింది. మీకు బయోపిక్‌లో నటించడానికి అవకాశం వస్తే ఎవరి స్టోరీని ఎంచుకుంటారు అని అడగగా, తాను అలనాటి స్టార్ హీరోయిన్, దివంగత శ్రీదేవి, సౌందర్య జీవిత కథలను ఎంచుకుంటాననని చెప్పుకొచ్చింది. నా జీవితంలో వారిద్దరూ నాకు రోల్ మోడల్స్. అతి తక్కువ సమయంలోనే ఇంత పెద్ద స్టార్ గా  ఎదగడానికి కారణం వారి జీవిత కథలే. ముందుగా ఎవరైనా దర్శకనిర్మాతలు వచ్చి బయోపిక్ లో నటించమని అడిగితే మొదటగా శ్రీదేవి గారి బయోపిక్ నటించేందుకు ప్రయత్నిస్తానని చెప్పింది. అవకాశం వచ్చినప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనైనా ఆ బయోపిక్ లు తీయడానికి వెనుకాడబోనని ఆమె చెప్పుకొచ్చింది. . గీతాగోవిందం, సరిలేరు నీకెవ్వరు, భీష్మ వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ లో నటించి, స్టార్ హీరోయిన్ల లిస్ట్ లోకి రష్మిక చేరిపోయింది. ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ నటిస్తున్న “పుష్ప” సినిమాలో కూడా నటించబోతోంది రష్మిక.

Related posts