telugu navyamedia
సినిమా వార్తలు

సోషల్ మీడియా వేదికగా రష్మికతో తల్లి సంభాషణ… వైరల్

Rashmika

కన్నడ భామ రష్మిక మందన్న తాజాగా “డియర్ కామ్రేడ్” చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ఫలితం తీసుకొచ్చిందనే విషయం పక్కనబెడితే తమకు మాత్రం ఎప్పుడూ మరిచిపోలేని జ్ఞాపకం అంటున్నాడు విజయ్ దేవరకొండ. ఆయనతో పాటు రష్మిక మందన్న కూడా లిల్లీ పాత్రను ఎప్పటికి మరిచిపోలేను అంటుంది. ఇక ఇప్పుడు ఈ చిత్రంపై రష్మిక మందన్న తల్లి కూడా స్పందించారు. తన కూతురు నటన చూసి ఈమె మురిసిపోయింది. ఇండస్ట్రీలోకి రావడానికి చాలా కష్టపడ్డానని, ఇంట్లో వాళ్లు కూడా వద్దనేసరికి పెద్ద ఫైట్ చేయాల్సి వచ్చిందని మొన్న ప్రీ రిలీజ్ వేడుకలో చెప్పింది రష్మిక. ఇప్పుడు అదే కుటుంబ సభ్యుల నుంచి తన సినిమాకు అద్భుతమైన స్పందన వచ్చేసరికి రష్మిక ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఈ సినిమాపై రష్మిక మందన్న తల్లి స్పందిస్తూ “డియర్ లిల్లీ.. నువ్వు నీ నటనతో తల్లిదండ్రులను గర్వపడేలా చేస్తున్నావ్.. నీకు నచ్చిన రంగంలో ఎదుగుతుంటే సంతోషంగా ఉంది.. లవ్‌ యూ బేబీ రష్మిక.. నువ్ నిజంగా చాలా బాగా నటించావు.. నీ తర్వాత సినిమాలకు కూడా ఆల్ ది బెస్ట్.. చివరగా మైత్రి మూవీ మేకర్స్‌కు ధన్యవాదాలు” అంటూ ట్వీట్ చేసింది. అమ్మ ట్వీట్ చూసి ఆనందపడిన రష్మిక “థాంక్యూ అమ్మా.. లవ్‌ యూ టూ.. ఇప్పుడు మా టీంతో కలిసి మరోసారి ఈ సినిమా చూసి అప్పుడు వర్షన్ చెప్పు” అంటూ రిప్లై ఇచ్చింది. ఈ మాటలు అక్కడితో ఆగలేదు. “అందరి ఆనందం కోసం నువ్వెప్పుడూ ఇలాగే కష్టపడాలి.. మా ఆశీర్వాదాలు నీకెప్పుడూ ఉంటాయి.. నటిగా ఈ జర్నీ ఆస్వాదించు” అంటూ ట్వీట్ చేసింది. దాంతో “అమ్మా నీ దగ్గర ఫోన్ ఉంది.. ఆ విషయం గుర్తు పెట్టుకో.. నేను ఖాళీగానే ఉన్నాను. నాకు ఫోన్ చేసి మాట్లాడు… మన మాటలు నెటిజన్లకు ఇబ్బంది కలిగిస్తాయి” అని ట్వీట్ చేసింది.

Related posts