telugu navyamedia
క్రీడలు వార్తలు

రషీద్ కు ఆ బ్యాట్సమెన్ భయపడుతున్నాడా…?

ఐపీఎల్ 2021 లో నిన్న జరిగిన మ్యాచ్‌లో రస్సెల్.. రషీద్ ఖాన్ బౌలింగ్‌లోనే ఔటయ్యాడు. సిక్సర్లు బాదకుండా ఎవరినీ వదిలిపెట్టని విండీస్ వీరుడు రషీద్ ఖాన్ బౌలింగ్‌లో మాత్రం తడబడుతున్నాడు. దాంతో రషీద్ ఖాన్‌కు విండీస్ వీరుడు భయపడుతున్నాడా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. వీరి మధ్య నమోదైన గణంకాలను పరిశీలించినా ఇదే విషయం స్పష్టం అవుతోంది. రస్సెల్ ఎప్పుడైతే రస్సెల్‌ క్రీజులోకి వచ్చాడో వెంటనే వార్నర్‌.. రషీద్‌ను రంగంలోకి దించాడు. అతను గూగ్లీకి మరోరూపమైన రాంగ్‌ అన్‌గా వేసిన 16.1 బంతిని రస్సెల్‌ లెగ్‌సైడ్‌ నుంచి బౌండరీకి వెళ్లింది. దాంతో వైడ్ల రూపంలో 5 పరుగులొచ్చాయి. ఆ తర్వాతా రషీద్ రాంగ్‌ అన్‌ వేసి పరుగు ఇవ్వలేదు. ఇక డిఫెన్స్‌ను ఛేదించేందుకు వచ్చిన రెండో బంతిని రసెల్‌ భారీ షాట్‌ ఆడాడు. లాంగ్‌ఆన్‌ మీదుగా గాల్లోకి లేచిన బంతిని మనీశ్‌ పాండే పరుగెత్తుకుంటూ వచ్చి సూపర్ ఫీల్డింగ్‌తో ఒడిసిపట్టాడు. దాంతో రస్సెల్ ఇన్నింగ్స్ ముగిసింది. తాజా వికెట్‌తో రషీద్‌ ఖాన్ 48 బంతుల్లోనే రస్సెల్‌ను నాలుగు సార్లు పెవిలియన్‌ పంపినట్టు అయింది. ఈ మ్యాచ్‌కు ముందు టీ20 క్రికెట్లో రస్సెల్‌ను ఈ అఫ్గాన్ బౌలర్ మూడుసార్లు ఔట్‌ చేశాడు. నిన్నటి మ్యాచ్‌లో బౌలర్లంతా విఫలమైన వేళ రషీద్ ఖాన్ ఒక్కడే రాణించాడు. కానీ ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ విజయాన్నందుకోలేకపోయింది. 10 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.

Related posts