telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సినిమా వార్తలు

టాలీవుడ్ లో విషాదం… రచయిత వెన్నెలకంటి మృతి

టాలీవుడ్ లో మరి విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ రచయిత వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్‌ చెన్నైలో మృతి చెందారు. 11 యేళ్ళ వయసులో ఆటవెలదిలో ‘భక్త దుఃఖనాశ పార్వతీశ’ మకుటంత శతకం రాసిన వెన్నెలకంటి, 13 సంవత్సరాల వయసులో లలితా శతకం రాశారు. శ్రీరామచంద్రుడు మూవీతో గీత రచయితగా సినీ ప్రస్థానం ప్రారంభించారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్‌ ఇండియాలో ఉద్యోగానికి రాజీనామా చేసి రచయితగా సినీ రంగ ప్రవేశం చేశారు. ఆత్మావత్ సర్వభూతాని, యత్ర నార్యస్తు పూజ్యంతే నాటికలు రాసిన వెన్నెలకంటి, వందలాది చిత్రాలకు మాటలు, పాటలు రాశారు. సినిమా రంగంలోనే ఉన్న వెన్నెలకంటి తనయులు శశాంక్, రాకేందు మౌళి. కమల్ హాసన్ అనువాద చిత్రాలకు మాటలు, పాటలు రాశారు. బాలు, కమల్ హాసన్ తో వెన్నెలకంటికి ప్రత్యేక అనుబంధం వుంది. పంచతంత్రం, పోతురాజు, దశావతారం, మన్మథభాణం, సరోజ.. తదితర చిత్రాలకు మాటలు రాశారు వెన్నెలకంటి. గత యేడాది విడుదలైన ‘పెంగ్విన్’ చిత్రానికి వెన్నెలకంటి పాటలు రాశారు. డబ్బింగ్ సినిమాలతో పాటు అగ్రకథానాయకుల చిత్రాలకూ పాటలు రాశారు. ఆదిత్య 369, ఘరానా బుల్లోడు, క్రిమినల్, సమరసింహారెడ్డి లో పాటలు రాశారు. వెన్నెలకంటి రెండు వేలకు పైగా పాటలు రాశారు. అయితే వెన్నెలకంటి మరణానికి టాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.

Related posts